అనంతపురం జిల్లాలో ఎన్నికైన జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు ప్రమాణస్వీకారం(Anantapur zp chairperson) కార్యక్రమం శుక్రవారం జరిగింది. జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో తొలుత జడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికైన ఛైర్‌పర్సన్ గిరిజమ్మ, ఉప ఛైర్మన్లు సుధాకర్‌రెడ్డి, నాగరత్నను మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మహమ్మద్ ఇక్బాల్, గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి తదితరులు అభినందించారు. మొత్తంగా జడ్పీ 22వ ఛైర్‌పర్సన్‌గా ఆత్మకూరు జడ్పీటీసీ బోయ గిరిజమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
‘నా ప్రత్యక్ష దైవం సీఎం జగన్'పై ప్రమాణం చేస్తున్నా..
జడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ(zp chairperson girijamma) ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఆత్మసాక్షిగా లేదా భగవంతుడిపై ప్రమాణం చేస్తున్నామని చెబుతారు. కానీ గిరిజమ్మ మాత్రం ప్రమాణపత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదువుతూ చివర్లో ‘నా ప్రత్యక్ష దైవం సీఎం జగన్‌పై ప్రమాణం చేస్తున్నాను’ అన్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని పరిశీలిస్తానని జిల్లా కలెక్టర్ చెప్పారు.
ఇదీ చదవండి..
ZP CHAIRMAN: కొలువుదీరిన కొత్త జడ్పీ ఛైర్మన్లు.. వివరాలిలా..