ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన - nimmagadda ramesh kumar latest news

ముందు చెప్పినట్టుగానే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నాలుగు దశలకూ ఒకేసారి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరిని ప్రభుత్వం¸ పునరుద్ఘాటించింది. ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్‌ఈసీపై విమర్శల జోరు మరింత పెంచారు. టీకా వేయకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న తరుణంలో.. అందరి చూపూ సుప్రీంకోర్టు వైపే ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

An unresolved stalemate over panchayat elections
పంచాయతీ ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన
author img

By

Published : Jan 24, 2021, 4:25 AM IST

పంచాయతీ ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన

పంచాయతీ ఎన్నికలపై ప్రతిష్టంభన తొలగలేదు... ఉత్కంఠకు తెరపడలేదు... ఎన్నికల సంఘం వెనకడుగు వేయలేదు... ప్రభుత్వం పట్టు వీడలేదు..! ముందు చెప్పినట్టుగానే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నాలుగు దశలకూ ఒకేసారి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాన్ని ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరి పునరుద్ఘాటించింది. ఎస్‌ఈసీ తలపెట్టిన వీడియో సమావేశానికి అధికారులంతా ముఖం చాటేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్‌ఈసీపై విమర్శల జోరు మరింత పెంచారు. టీకా వేయకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఎస్‌ఈసీ.. ఎన్నికలను అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగసంఘాల వైఖరినీ తప్పుబట్టారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం మాత్రం తన వైఖరిని వీడలేదు. ఎస్‌ఈసీ వీడియో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా అధికారులెవరూ వెళ్లలేదు సరికదా, జిల్లా కలెక్టర్లనూ వెళ్లనివ్వలేదు. తాజా పరిణామాలపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానున్న తరుణంలో.. అందరి చూపూ సుప్రీంకోర్టు వైపే ఉంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సోమవారం విచారించనున్న సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల్ని అడ్డుకుంటే మూల్యం తప్పదు...

పంచాయతీ ఎన్నికల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే దానికి ప్రభుత్వ వ్యవస్థే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అవరోధాలు తలెత్తినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన సందర్భంగా.. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్నికలు జరపాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉంది. ఎన్నికల సంఘంలో వేళ్లమీద లెక్కించదగ్గ సంఖ్యలోనే సిబ్బంది ఉంటారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల ద్వారా జిల్లా కలెక్టర్లు ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అవరోధాలు ఎదురైనా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ యంత్రాంగానిదే. ఎన్నికలకు అవరోధం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా దానిపై గవర్నరుకు నివేదిక అందజేస్తా. సోమవారం కేసు విచారణ సందర్భంగా.. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని సుప్రీంకోర్టుకూ నివేదించాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోవడం లేదు. అవసరమైతే నివేదిస్తాను. ఉన్న పరిస్థితుల్ని దాచలేను’ అని ఆయన స్పష్టం చేశారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, అవరోధాలన్నీ అధిగమించి ఎన్నికలు జరపాలన్న కృత నిశ్చయంతో, జరపగలమన్న నమ్మకంతో ఎన్నికల సంఘం ఉందన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి సహేతుకంగా లేనందునే తిరస్కరించామన్నారు.

ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యల్ని ఎప్పటికప్పుడు గవర్నరు, న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి, రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇది నా వ్యక్తిగత నిర్ణయం కానేకాదు. నాకున్న రాజ్యాంగ బాధ్యతల్ని మాత్రమే నిర్వహిస్తున్నా. ఇకపైనా అలాగే వ్యవహరిస్తా. - ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌

పంచాయతీరాజ్‌శాఖది బాధ్యతారాహిత్యం

‘ప్రభుత్వపరంగా లభించాల్సిన తోడ్పాటుపై కమిషన్‌కు మిశ్రమ అనుభవాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పరిణతి చెందిన అధికారులు. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ వారితో నాకు సత్సంబంధాలున్నాయి. ఎలాంటి సమస్యనైనా చర్చలతో పరిష్కరించాలన్న తత్వం ఎన్నికల సంఘానికి మొదటి నుంచీ ఉంది. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలియజేశాం. కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాం. తాజా ఓటర్ల జాబితాల్ని సిద్ధం చేయడంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరు పూర్తిగా విఫలమయ్యారు. విధిలేని పరిస్థితుల్లోనే 2019 సంవత్సరం ఓటర్ల జాబితాలతో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడంవల్ల 18 ఏళ్ల వయసు నిండిన సుమారు 3.6 లక్షల మంది యువత.. ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో పంచాయతీరాజ్‌శాఖ అలసత్వం, బాధ్యతారాహిత్యాన్ని కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. బాధ్యులపై తగిన సమయంలో తగిన చర్యలు ఉంటాయి’ అని రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాల తీరు సరికాదు

‘ఎన్నికల్లో అక్రమాల్ని సహించం. ముఖ్యంగా ఏకగ్రీవాలపై కమిషన్‌ ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఐజీ స్థాయి పోలీసు అధికారి పర్యవేక్షణలో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్న దృఢసంకల్పంతో కమిషన్‌ ఉంది. ఎన్నికలపై కొన్ని ఉద్యోగ సంఘాలు కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే రాష్ట్రంలో ఎన్నికలు వద్దని కోరుకోవడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు. మనం సేవకులం. మనం నిబద్ధతతో ప్రజాహితం, సంక్షేమం కోసం పనిచేయాలన్న వాదనను విస్మరిస్తే దుష్ఫలితాలుంటాయి. ఎన్నికల్ని నిరవధికంగాగానీ, పాక్షికంగాగానీ వాయిదా వేయాలన్న వాదనలో హేతబద్ధత కనపడనందుకే తిరస్కరించా తప్ప వేరే కారణం లేదు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి గవర్నరు నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుందన్న భరోసాతో ఉన్నాం. కమిషన్‌కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం, విశ్వాసం, విధేయత ఉన్నాయి. ఇకపైనా ఉంటాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కమిషన్‌ వెంటనే అమలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టులో తుది నిర్ణయం ఏదైనా వస్తే దాన్నీ తప్పనిసరిగా పాటిస్తాం’ అని తెలిపారు.

సీఎస్‌ లేఖ నాకంటే ముందే మీడియాకా?

‘గవర్నరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి రాజ్యాంగబద్ధ, ఉన్నత పదవుల్లో ఉన్నవారి మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగా ఉంచాలి. ఇంత వరకు గవర్నరు, సీఎస్‌లతో ఎస్‌ఈసీ నిర్వహించిన సంప్రదింపులేవీ పత్రికాముఖంగా బహిరంగపరచలేదు. కానీ శుక్రవారం సీఎస్‌ రాసిన లేఖ నాకు చేరడానికి ముందే పత్రికలు, ఛానళ్లకు వెళ్లింది. ఇక మీదటైనా విధివిధానాల్ని, మంచి సంస్కృతిని, గోప్యతను పాటించాలని కోరుతున్నా. మన మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలకు సమాచార హక్కు చట్టం నుంచీ మినహాయింపు ఉంది. ఆ నిబంధనల్ని మనమే తోసిరాజనడం సరికాదని కమిషన్‌ భావిస్తోంది’ అని ఎస్‌ఈసీ పేర్కొన్నారు.

ఇవి చరిత్రాత్మక ఎన్నికలు

‘ఇప్పుడు జరిగే పంచాయతీ ఎన్నికల్ని చరిత్రాత్మకమైనవిగా భావించాలి. పలు కారణాలవల్ల వీటికి ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎన్నికలపై ఓటర్లు, ప్రజలు, సమాజంలో ఉత్సుకత, ఆసక్తి ఉన్నాయి. ఎన్నికల్లో పాల్గొనాలన్న వారి దృఢ దీక్ష, దృక్పథాన్ని మనమంతా గౌరవించాలి. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం నైతికంగా సరికాదు. ఎన్నికలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నా.. వాటి ప్రభావం ఎన్నికల నిర్వహణపైనా, పోటీ చేసే అభ్యర్థులపైనా ఉండదని కమిషన్‌ బలంగా విశ్వసిస్తోంది. సేవాభావంతో, సామాజిక బాధ్యతతో నాయకత్వం చేపట్టాలని చాలా మంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. వారిపై హింసకు దిగినా, పోటీ చేయకుండా అవరోధాలు కల్పించినా కమిషన్‌, పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తాయి. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరపాలన్నదే కమిషన్‌ ధ్యేయం. రెండు రోజుల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం, మూడు రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుగుతున్నాయి. ఈ సమయంలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సంయమనంతో, విజ్ఞానంతో, వివేకంతో వ్యవహరించాల్సిన బాధ్యత, అవసరం ఉన్నాయి’ అని ఎస్‌ఈసీ పేర్కొన్నారు.

నిధులు, సిబ్బంది కొరతే

‘జిల్లా కలెక్టర్లకు ఉన్నట్టే ఎన్నికల సంఘానికీ కొన్ని సమస్యలున్నాయి. నిధులు, సిబ్బంది కొరత ఉంది. కమిషన్‌కు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, సంయుక్త సంచాలకులు, న్యాయసలహాదారు లేరు. ఉన్న కొద్ది మందీ అంకితభావంతో పనిచేయడం వల్లే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చే స్థాయికి వచ్చాం. మా సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, కోర్టూ ఆదేశించినా ఫలితం లేదు. ఎన్నికల సంఘం కోరినప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధుల్ని, సిబ్బందిని సమకూర్చేలా ప్రభుత్వాన్ని గవర్నరు ఆదేశించాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఈ విషయాలన్నీ గవర్నరు దృష్టికి తీసుకెళ్లా’ అని తెలిపారు.

ఎస్‌ఈసీ వీడియో సమావేశానికి అధికారుల గైర్హాజరు..

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం తలపెట్టిన వీడియో సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు గైర్హాజరయ్యారు. దీంతో సమావేశం రద్దయింది. శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలనుకుంటున్నట్లు ఎస్‌ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులకు, జిల్లా కలెక్టర్లకు ముందుగానే వర్తమానం పంపించారు. శనివారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంలో ఎస్‌ఈసీ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల నిర్వహణకు జిల్లాల్లో నిధులు, సిబ్బంది కొరత ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో వాటిని పరిష్కరించాలని భావిస్తున్నాం. సీఎస్‌, డీజీపీ, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు తప్పనిసరిగా సమావేశానికి హాజరై సూచనలివ్వాలని కోరాం. పని ఒత్తిళ్లున్నా వారంతా వస్తారనే భావిస్తున్నాం’ అని చెప్పారు. కానీ ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరికే ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో అధికారులు ఎవరూ వీడియో సమావేశానికి హాజరవలేదు. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానున్నందున, కోర్టు తుది ఉత్తర్వులు వెలువడేవరకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని, వీడియో సమావేశాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఎస్‌ఈసీకి శనివారం లేఖ రాశారు. వాయిదా కుదరదంటూ ఎస్‌ఈసీ వెంటనే లేఖ పంపారు.

టీకాలపైనా చర్చిద్దాం

‘పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ చేసేశాం. అది నిర్దిష్ట కాలావధిలో పూర్తి చేయాల్సిన, వెనక్కు తీసుకోలేని ప్రక్రియ. కరోనా టీకాలకు సంబంధించి ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో చర్చించి, తగిన ఆదేశాలివ్వాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మీతో పాటు, ఈ సమావేశానికి ఆహ్వానించిన అధికారులంతా హాజరవడం చాలా ముఖ్యం. ఎన్నికల సన్నద్ధతతో పాటు, టీకాల కార్యక్రమానికి సంబంధించిన అంశాల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియో కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయలేం. దీన్ని రద్దు చేస్తే ఎన్నికల ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని ఎస్‌ఈసీ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆదేశాలు రాలేదని..

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో కలెక్టర్లు ఎవరూ హాజరుకాలేదు. శ్రీకాకుళం కలెక్టర్‌ గ్రామ సచివాలయాల సందర్శనకు వెళ్లారు. విజయనగరం కలెక్టర్‌ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లారని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. విశాఖ, ప్రకాశం, తూ.గో. జిల్లాల కలెక్టర్లు బంగ్లాల్లోనే ఉండిపోయారు. కృష్ణా కలెక్టర్‌ వార్డు సచివాలయాన్ని సందర్శించారు. గుంటూరు జేసీ సమావేశానికి హాజరవలేదు. చిత్తూరు కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ను తెరవనేలేదు. కర్నూలు కలెక్టర్‌ అనారోగ్యంతో సెలవు పెట్టారు.

మూడు గంటలు వేచి చూసినా..

విజయవాడలో ఎన్నికల సంఘం కార్యాలయ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలుకు మధ్యాహ్నం 3 గంటలకే ఎన్నికల సంఘ సహాయ కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు వెళ్లారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చిన వెంటనే వెళ్లేందుకు ఎస్‌ఈసీ ఛాంబర్‌లో సిద్ధంగా ఉన్నారు. సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి రావడం లేదని మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల సంఘానికి స్పష్టత వచ్చింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో.. జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా అధికారులు కూడా వీడియోకాన్ఫరెన్స్‌కి హాజరవలేదు. 4 గంటల వరకు వేచి చూసిన ఎన్నికల అధికారులు.. ప్రభుత్వ అధికారుల గైర్హాజరు గురించి ఎస్‌ఈసీకి వివరించారు. దీంతో రమేశ్‌కుమార్‌ సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉండి, కార్యాలయం నుంచి బయల్దేరి వెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.