ETV Bharat / city

మహిళా ఉద్యోగులకు అదనంగా 5 సీఎల్‌లు: సీఎం - CM Jagan Review News

రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు అదనంగా 5 సీఎల్‌లు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. అంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్‌ఆర్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలు, సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి వనిత, డీజీపీ గౌతం సవాంగ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మహిళా ఉద్యోగులకు అదనంగా 5 సీఎల్‌లు: సీఎం

author img

By

Published : Mar 4, 2021, 7:39 PM IST

మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌కు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2 వేల స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

మార్చి 8న సెల్​ఫోన్లు కొనే మహిళలకు 10 శాతం రాయితీ ప్రకటించారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే మహిళలకు పది శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మహిళలకు 10 శాతం రాయితీ ఉండనుంది.

మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలీస్‌ విభాగంలో చేసే మహిళలకు మార్చి 8న స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించారు. ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సత్కరించనున్నట్టు తెలిపారు. దిశపై ప్రచారం చేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దిశ కింద చేపట్టే చర్యలు, అవగాహనకు విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేశారు.

అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్‌ చెకప్‌ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నాన్‌ గెజిటెడ్‌ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. చేయూత దుకాణాల్లో శానిటరీ పాడ్స్‌ అందుబాటులో ఉంచాలన్న ముఖ్యమంత్రి.. శానిటరీ పాడ్స్‌ కోసం సెర్ప్, మెప్మా, హెచ్‌ఎల్‌ఎల్‌ మధ్య ఎంఓయూ కుదిరినట్టు వివరించారు. బాలికలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఇంటర్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండీ... నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.