ETV Bharat / city

‘రాజధాని’ తీసేసి ‘అమరావతి'.. నగరాభివృద్ధి సంస్థగా మార్పు - amrda news

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను (ఏపీసీఆర్‌డీఏ) రద్దు చేసి, దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఏఎంఆర్‌డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఆర్‌డీఏ కమిషనరుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి పి.లక్ష్మీనరసింహంనే ఏఎంఆర్‌డీఏ కమిషనరుగా నియమించింది.

amrda replaced as apcrda
‘రాజధాని’ తీసేసి ‘అమరావతి'
author img

By

Published : Aug 3, 2020, 6:24 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను (ఏపీసీఆర్‌డీఏ) రద్దు చేసి, దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఏఎంఆర్‌డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఏఎంఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. దీన్ని రాజపత్రంలో ప్రచురిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం సీఆర్‌డీఏ కమిషనరుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి పి.లక్ష్మీనరసింహంనే ఏఎంఆర్‌డీఏ కమిషనరుగా నియమించింది.

ఏపీసీఆర్‌డీఏను రద్దు చేసి దాని స్థానంలో ఏఎంఆర్‌డీఏను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రే జీవో జారీ చేసినా రహస్యంగా ఉంచింది. ఆదివారం బయటపెట్టింది. కొత్తగా ఏర్పాటైన ఏఎంఆర్‌డీఏకు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఉంటారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యుడిగానూ, ఏపీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనరు కన్వీనరుగానూ వ్యవహరిస్తారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్, గుంటూరు జిల్లా ఉప రవాణా కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన రోడ్లు, భవనాలశాఖ ఎస్‌ఈలు, ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ, ఏపీ సీపీడీసీఎల్‌ ఎస్‌ఈలు అథారిటీలో సభ్యులుగా ఉంటారు.

అథారిటీ ఛైర్మన్‌ నియామకంపై తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. పర్యావరణ విభాగం నుంచి, పట్టణ పరిపాలన, ప్రణాళిక, పరిరక్షణ, పర్యావరణం, రవాణా రంగాలకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ నిపుణుల్ని ఏఎంఆర్‌డీఏలో సభ్యులుగా నియమిస్తామని, వారికి సంబంధించిన ఉత్తర్వులు తర్వాత జారీ చేస్తామని తెలిపింది. ఏపీసీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి, డిప్యూటీ ఛైర్మన్‌గా పురపాలకశాఖ మంత్రి ఉండేవారు. ఏఎంఆర్‌డీఏకు ముఖ్యమంత్రిగానీ, పురపాలకశాఖ మంత్రిగానీ ఛైర్మన్‌గా ఉండకపోవచ్చని, మరొకరిని ఛైర్మన్‌గా నియమిస్తారని అధికార వర్గాల సమాచారం.

ఇవీ చదవండి...

కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకోవడం చట్టరీత్యా నేరం: న్యాయ సేవాధికార సంస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.