రాజధానికి చెందిన 29 గ్రామాల్లో దాదాపు 450 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తుండగా.. కొత్త పొరుగు సేవల ఏజెన్సీ నియామకానికి ఏఎంఆర్డీఏ చర్యలు చేపట్టింది. దాని ఎంపిక కోసం సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంచనాలు రూపొందించన అనంతరం టెండర్లు పిలిచి, ఖరారు చేయనున్నారు.
ఎలైట్ ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కమిషనర్ లక్ష్మీనరసింహం గత వారం రద్దు చేశారు. ఆగస్టులో కాంట్రాక్టు దక్కించుకున్న సదరు సంస్థ.. ఇప్పటి వరకు ఒక్క నెల కూడా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జీతాలు చెల్లించకపోవడంపై కార్మికులు ఆందోళన చేపట్టి చలో సచివాలయం’ కార్యక్రమం నిర్వహించగా.. రూ. 2 కోట్ల బకాయి వేతనాలను ఏఎంఆర్డీఏ చెల్లించింది.
ఇదీ చదవండి:
భార్యపై అనుమానం.. హత్యచేసేందుకు భర్త ప్రయత్నం.. సహకరించిన కుమారుడు