ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 383వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తుళ్లూరు దీక్షా శిబిరంలో.. అమరావతి ఉద్యమ ఫొటోలతో బహుజన ఐకాస రూపొందించిన కాలమానిని ఆవిష్కరించారు. గతేడాది నుంచి ఈ ఉద్యమంలో రైతులు, మహిళలు చేసిన పోరాటాలు.. పోలీసుల నుంచి ఎదురైన ప్రతిఘటనల చిత్రాలతో దీనిని తయారు చేశారు. ఐకాస నాయకులు చేతుల మీదుగా ఈ కేలండర్ను విడుదల చేశారు.
రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఐకాస నేతలు తప్పుపట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దేవాలయాలపై జరిగిన దాడుల్లో ఎన్నింటిపై కేసులు నమోదు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని.. కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: