అమరావతి కోసం రాజధాని గ్రామాల్లో 100వ రోజు నిరసన దీక్షలు కొనసాగాయి. ఇళ్ల వద్ద కొందరు, దీక్షా శిబిరాల సామాజిక దూరం పాటిస్తూ ఇంకొందరు ఎక్కడికక్కడ... అమరావతే రాజధానిగా కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన విరమించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని ప్రకటిస్తే తాము లాక్‌డౌన్ పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతామని అంటున్నారు.
ఇదీ చదవండి: