రాష్ట్రానికి 3 రాజధానుల ప్రతిపాదన, నిపుణుల కమిటీ సిఫారసుల వ్యవహారంపై.. అమరావతి పరిధిలోని రైతుల ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. శనివారం తీవ్ర స్థాయిలో జరిగిన రైతుల పోరాటం.. ఆదివారం మరింత ఉద్ధృతం కానుంది. నేటి ఉద్యమ కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నిన్న ప్రకటించింది. ఉదయం 8.30 గంటలకు ఉద్దండరాయునిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో వంటా వార్పు నిర్వహించనున్నారు. అదే సమయానికి తుళ్లూరు, మందడం, రాయపూడి, పెద్దపరిమిలో మహాధర్నా చేపట్టనున్నారు. వెలగపూడిలో ఐదో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. 29 గ్రామాల రైతులు 4 ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొననున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: