పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 105వ రోజుకు చేరుకున్నాయి. కరోనా నేపథ్యంలో రైతులు, మహిళలు ఇళ్ల వద్దే దీక్ష చేయాలని ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు, మహిళలు, చిన్నారులు తమ ఇళ్లవద్దే ఆందోళన కొనసాగిస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్లూరు, మంగళగిరి మండలం నీరుకొండలో రైతులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: క్వారంటైన్లో ఆకలితో గడిపి.. కరోనాపై గెలిచి...