ETV Bharat / city

దిల్లీలో పలువురు ఎంపీలను కలిసిన అమరావతి మహిళా జేఏసీ - amaravathi mahila jac latest news

రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు...మహిళా జేఏసీ నేతలు, రైతులు దిల్లీలో గళమెత్తుతున్నారు. అమరావతి అంశాన్ని లోక్​సభలో లేవనెత్తాలంటూ...వివిధ పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టే యత్నాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంతో పాటు తమ గోడును చెప్పుకుంటున్నారు.

అమరావతి మహిళా జేఏసీ
అమరావతి మహిళా జేఏసీ
author img

By

Published : Sep 22, 2020, 3:34 PM IST

అమరావతిలోనే రాజధాని కొనసాగించాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు దిల్లీ వెళ్లిన మహిళా ఐకాస నాయకులు...పలు పార్టీల ఎంపీలను కలిశారు. ఎంపీ రఘురామకృష్ణరాజుతో కలిసి...టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్​ని కలిశారు. ఏపీ ప్రభుత్వ తీరును వివరించి వినతి పత్రం అందించారు. ఈ అంశాన్ని లోక్​సభలో లేవనెత్తే విషయంపై తమ పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

శివసేన ఎంపీ అరవింద్ సావంత్‌, కాంగ్రెస్ ఎంపీ కోడికొన్నిల్ సురేశ్‌ను కలిసి తమ గోడు చెప్పారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరించారు. అమరావతి ఏర్పాటుపై ఆనాడు దిల్లీ నేతలంతా సుముఖత వ్యక్తం చేశారని ఎంపీ సురేశ్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి రాజధానికి పునాదులు వేసిందన్నారు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మాణం జరుగుతుందని అంతా భావించారని వ్యాఖ్యానించారు. దాదాపు ఏడాదిగా రైతులు చేస్తున్న ఆందోళన తమకు తెలుసునని...రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సురేశ్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని లోక్​సభలో లేవనెత్తుతామని హామీ ఇచ్చారు.

రైతుల త్యాగాలను నిర్లక్ష్యం చేయవద్దని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ జగన్ ప్రభుత్వానికి సూచించారు. భూములిచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. విభజన నాటి నుంచి ఏపీకి న్యాయం జరగాలనే శివసేన కోరుకుంటోందని స్పష్టం చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని రాజధాని రైతులకు న్యాయం జరిపించాలన్నారు. రాజధాని అంశాన్ని రాష్ట్ర ఎంపీలు లేవనెత్తితే మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి

280వ రోజూ అమరావతి రైతుల ఉద్యమ హోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.