- సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి బయల్దేరిన దివ్యాంగుల అరెస్టు
- మంగళగిరి జాతీయ రహదారిపై దివ్యాంగులను అడ్డుకున్న పోలీసులు
- పోలీసులు, దివ్యాంగులకు మధ్య వాగ్వాదం, నినాదాలు
సీఎం నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత.. ఎక్కడికక్కడ అరెస్టులు - ఏపీ సీఎం నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత
12:35 July 19
సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి బయల్దేరిన దివ్యాంగుల అరెస్టు
12:33 July 19
తెలుగు యువత అక్రమ అరెస్టులను ఖండించిన జీవీ ఆంజనేయులు
ఉద్యోగ నోటిఫికేషన్ కోసం యువత ఆందోళన చేస్తోందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రాజెక్టు పరిశీలన పేరుతో సీఎం జగన్ పోలవరం వెళ్లారన్నారు. ఉద్యోగాల హామీని సీఎం నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై యువత తిరుగుబాటు చేసిందన్న ఆంజనేయులు.. తెలుగు యువత అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు.
11:42 July 19
'చలో తాడేపల్లి' నిరసన కార్యక్రమం ఉద్రిక్తం
కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న డిమాండ్ తో....యువజన, విద్యార్థి సంఘాలు తలపెట్టిన 'చలో తాడేపల్లి' నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగా అప్రమత్తమైన అధికారులు.. చలో తాడేపల్లికి అనుమతి లేదని ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం నివాసం దగ్గర..భారీ బందోబస్తు చేపట్టారు. సీఎం ఇంటి ముట్టడికి యత్నించిన యువజన, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు.
కొత్త జాబ్ క్యాలెండర్ డిమాండ్ తో.. విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా వెయ్యిమంది పోలీసులతో.. సీఎం నివాసం దగ్గర భారీ బందోబస్తు చేపట్టారు. సీఎం ఇంటి వైపు వెళ్లే మార్గాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జాతీయరహదారి నుంచి సీఎం ఇంటికి...యువజన సంఘాలు ర్యాలీకి యత్నించాయి. ఈ క్రమంలో T.N.S.F యువజన సంఘాల నేతలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను గుంటూరు నల్లపాడు పోలీసుస్టేషన్ కు తరలించారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోరితే అరెస్ట్ చేస్తారా అంటూ.. విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. అరెస్టులను నిరసిస్తూ.. నల్లపాడు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. అక్రమ దిగ్బంధంతో ఉద్యమాన్ని ఆపలేరని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని.. తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థి సంఘాలకు.. మద్దతు తెలిపారు. మీడియాతో మాట్లాడుతున్న ఆలపాటిని.. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు.
అంతకుముందు.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర యువజన సంఘాల నేతలను కూడా.. పోలీసులు అరెస్టు చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసగిస్తోందని.. యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 2 లక్షల 30 వేల ఉద్యోగాలతో.. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశాయి.
11:36 July 19
ఎక్కడికక్కడ అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలింపు
చలో తాడేపల్లికి.. తెలుగుదేశం, వామపక్షాలు, అమరావతి దళిత ఐకాస సహా.. పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి యత్నించిన తెలుగు యువత, T.N.S.F కార్యకర్తలను.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. జాతీయరహదారి నుంచి సుమారు కిలోమీటరు మేర సీఎం నివాసం వరకు ర్యాలీగా వచ్చిన నేతలను అడ్డగించారు.
10:09 July 19
పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు
పాత టోల్ గేట్ సెంటర్ లో పోలీసుల్ని భారీగా మోహరించినా.. తెలుగు యువత నాయకులు కొందరు చొచ్చుకెళ్లారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లు చేసినా.. సీఎం నివాస ప్రాంతం వరకూ చేరుకున్నారు. పోలీసులను చేధించుకుని తెలుగు యువత నాయకులు ముందుకెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది.
09:41 July 19
డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
పాత టోల్ గేట్ సెంటర్‌లో పోలీసుల్ని భారీగా మోహరించినా.. తెలుగు యువత నాయకులు చాకచక్యంగా చొచ్చుకెళ్లారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లు చేసినా.. సీఎం నివాస ప్రాంతం వరకు చేరుకున్నారు. వీరిని అడ్డగించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. వీరిని చేధించుకొని తెలుగు యువత నాయకులు ముందుకు చొచ్చుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది.
09:40 July 19
చలో తాడేపల్లికి ప్రజాసంఘాల మద్దతు.. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి యత్నం
చలో తాడేపల్లికి.. తెలుగుదేశం, వామపక్షాలు, అమరావతి దళిత ఐకాస సహా పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి యత్నించిన తెలుగు యువత, T.N.S.F కార్యకర్తలను.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి సుమారు కిలోమీటరు మేర సీఎం నివాసం వరకు ర్యాలీగా వచ్చిన నేతలను.. అడ్డగించారు.
09:40 July 19
కొత్త జాబ్ క్యాలెండర్ డిమాండ్‌తో నిరుద్యోగుల నిరసన ఉద్రిక్తం
కొత్త జాబ్ క్యాలెండర్ డిమాండ్‌తో.. విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులు సీఎం నివాసం దగ్గరకు వెళ్లేందుకు యత్నించగా... తాడేపల్లి పాత టోల్‌గేట్ కూడలి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చలో తాడేపల్లి పిలుపుతో.. ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా వెయ్యిమంది పోలీసులతో భద్రత చేపట్టారు. సీఎం ఇంటి వైపు వెళ్లే మార్గాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారి నుంచి సీఎం ఇంటికి...యువజన సంఘాలు ర్యాలీకి యత్నించాయి. ఈ క్రమంలో.. టీఎన్‌ఎస్‌ఎఫ్, యువజన సంఘాల నేతలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను గుంటూరు నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసగిస్తోందని.. టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు యువత, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
09:05 July 19
తాడేపల్లిలోని సీఎం నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత
- తాడేపల్లిలోని సీఎం నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత
- సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
- తాడేపల్లి పాత టోల్‌గేట్ కూడలి వద్ద ఉద్రిక్తత
- సీఎం నివాసం వద్దకు వెళ్లేందుకు నిరుద్యోగుల యత్నం
- ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
- జాతీయ రహదారి నుంచి సీఎం ఇంటికి యువజన సంఘాల ర్యాలీ
- పోలీసుల అదుపులో టీఎన్‌ఎస్‌ఎఫ్, యువజన సంఘాల నేతలు
- గుంటూరు నల్లపాడు పోలీసుస్టేషన్‌కు ఆందోళనకారుల తరలింపు
- జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్నారని నిరసన
- టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు యువత, యువజన సంఘాల నిరసన
- సీఎం ఇంటికి వెళ్లే మార్గాల్లో భారీగా మోహరించిన పోలీసులు
- ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా వెయ్యిమంది పోలీసులతో భద్రత
- సీఎం ఇంటి వైపు వెళ్లే మార్గాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
- ఐకాస నేతలను ఇళ్లలో నిర్బంధించిన పోలీసులు
08:58 July 19
AMARAVATHI LIVE PAGE
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్‌తో చలో తాడేపల్లి కార్యక్రమానికి నిరుద్యోగ ఐకాస పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు తెలుగుదేశం, వామపక్షాలు, అమరావతి దళిత ఐకాస మద్దతు తెలిపాయి. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.... చలో తాడేపల్లికి అనుమతి లేదని తెలిపారు. ఆదివారం రాత్రి నుంచే ఎక్కడికక్కడే యువజన, విద్యార్థి నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. నోటీసులు జారీ చేసి బయటకు రావొద్దని హెచ్చరించారు. గుంటూరు జిల్లాకు వస్తున్న వారిపై పోలీసుల నిఘా పెట్టారు. నిరసన తెలపకుండా అడ్డుకోవటంపై అమరావతి దళిత ఐకాస నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.