విజయవాడలోని సమితి కార్యాలయంలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు సమావేశమయ్యారు. రైతులు చేసిన త్యాగాలను ప్రభుత్వ ప్రతినిధులు అవమానిస్తూ.. అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 217 రోజులుగా మహిళలు, రైతులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ బిల్లులను ఆమోదిస్తే.. భూములు ఇచ్చిన రైతులు నట్టేట మునిగిపోతారన్నారు.
ప్రభుత్వం వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా ఓ కులం పేరుతో కర్షకులను కష్టపెడుతోందన్నారు. 29వేల కుటుంబాలు భూములు ఇస్తే.. ఓ సామాజిక వర్గం పేరుతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలి తప్ప.. కుట్రపూరితంగా శాసన రాజధానిగా ఉంచుతామనడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: 'వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా.. కోవిడ్ పరీక్షా కేంద్రాలు'