మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతి రైతులు, మహిళలు 633వ రోజు ఆందోళన కొనసాగించారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, నెక్కల్లు, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు దీక్షా శిబిరాలలో నిరసనను తెలియజేశారు. దీక్షా శిబిరాల్లోనే వినాయకుడికి పూజలు నిర్వహించారు. అమరావతికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని వేడుకున్నారు. జై అమరావతి, జై గణేశా అంటూ.. నినాదాలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక... రాజధాని గ్రామాల్లో ఏ ఒక్క పండగైనా ఇళ్లల్లో నిర్వహించుకోలేదని రాజధాని రైతులు వాపోయారు. రాజధాని ప్రజలంటే ముఖ్యమంత్రికి ఎందుకింత కోపమని మహిళలు ప్రశ్నించారు. పండగపూట కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని రైతులు అన్నారు.
Ganesh Chaturthi: నిరాడంబరంగా వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం