రాజధాని నిర్మాణానికి భూములిచ్చి మోసపోయిన తమను ఆదుకోవాలంటూ అమరావతి రైతులు 309వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఐనవోలు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, అనంతవరం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. మందడం, అనంతవరం, బోరుపాలెం దీక్షలో ఏర్పాటు చేసిన ఉద్యమకారిణి అమ్మవారిని సరస్వతి అలంకారంలో అలంకరించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగేలా.. చూడాలంటూ పూజలు నిర్వహించారు. అమ్మవారి స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ఉత్సాహంగా చేస్తామని మహిళలు చెప్పారు.
ఇదీ చదవండి: 'వైఎస్సార్ బీమా' పథకం ప్రారంభం