ETV Bharat / city

'వైకాపా 151 గ్రహాల నుంచి అమరావతిని కాపాడండి' - Amaravathi farmers Agitation latest news

రాజధానిగా అమరావతిని కొసాగించాలంటూ రైతులు, మహిళలు ఆందోళన ఉద్ధృతం చేశారు. వరుసగా 235వ రోజూ రాజధాని గ్రామాల్లో నిరసన హోరెత్తింది. వివిధ రూపాల్లో రాజధాని రైతులు, మహిళలు తమతమ నిరసన తెలియజేశారు. పలు పార్టీల నుంచి ప్రతినిధులు రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు పలికారు.

Amaravathi Farmers Agitation for capital city
ఆందోళన ఉద్ధృతం
author img

By

Published : Aug 8, 2020, 9:27 PM IST

ఆందోళన ఉద్ధృతం

మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దుపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఓవైపు న్యాయపోరాటం చేస్తున్న రైతులు.. మరోవైపు క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలనూ ఉద్ధృతం చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో రాజధాని రైతులు వరుసగా 235వ రోజూ ధర్నాలు నిర్వహించారు. అమరావతే ఏకైక పరిపాలన రాజధానిగా ఉండాలంటూ నినాదాలు చేశారు. మందడం ధర్నా శిబిరంలో 151 బొమ్మలను ఏర్పాటు చేసిన రైతులు, మహిళలు... ఈ గ్రహాల నుంచి అమరావతిని కాపాడాలంటూ వేడుకున్నారు.

తుళ్లూరులో రైతులు, మహిళలు ఒంటికి మట్టి పూసుకుని నిరసన తెలిపారు. ఓవైపు రైతులు 235 రోజులుగా పోరాటం చేస్తుంటే హైకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని రైతులు ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే ప్రజాధనం వెచ్చించి ప్రజలపై కోర్టులకు వెళ్లడమేంటని రైతులు, మహిళలు ప్రశ్నిస్తున్నారు. మాట తప్పి మడమ తిప్పిన పాలకులు చేసిన తప్పిదాలకు భూములిచ్చిన రైతుల కుటుంబాలను వీధిన పడేయడం నైతిక ధర్మమా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని రైతుల ఆందోళనకు పలు పార్టీల నుంచి ప్రతినిధులు హాజరై సంఘీభావం ప్రకటించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ రైతులు, మహిళల పోరాటానికి మద్దతు తెలిపారు. రాజధాని కోసం రైతులు ప్రాణప్రదంగా చూసుకునే భూముల్ని తృణప్రాయంగా అప్పగించారని... రాజధానిగా అమరావతిని అందరూ అంగీకరించారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుర్తుచేశారు. ఏ పార్టీకో రైతులు భూములు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 3 రాజధానుల నిర్ణయంపై ముఖ్యమంత్రి మనసు మార్చుకోవాలని పుల్లారావు విజ్ఞప్తి చేశారు.

రాజధాని ఏర్పాటుతో సంబంధం లేదంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ తప్పుబట్టారు. సంబంధం లేనప్పుడు వేలాది కోట్లాది రూపాయలు అమరావతికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అలాగైతే రాష్ట్ర విభజన చట్టాన్ని కూడా తూచ్ అందామా...? అంటూ ప్రశ్నించారు. తనపై చర్యలు తీసుకున్నా పర్వాలేదని... నిజమే మాట్లాడుతున్నానని చెప్పారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించడానికి వీల్లేదని... రాజధాని రైతుల తరపున పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

మూడు రాజధానులతో మూడు రాష్ట్రాలకు తెరలేపుతున్నారని గోపాలకృష్ణ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులతో రాజధానికి భూములు ఇప్పించినందుకు పశ్చాత్తాపపడుతూ... గోపాలకృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పుతో తనను తాను కొట్టుకున్నారు. రాజధాని అమరావతి కోసం ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలో నిరసన పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని రైతులు, మహిళలు నిర్ణయించారు.

ఇదీ చదవండీ... 'చంద్రబాబుకు కావాల్సిన వారికే అమరావతి కామధేనువు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.