ETV Bharat / city

భూములిచ్చింది రాజధాని కోసం... రాజకీయాల కోసంకాదు - ఏపీ మూడు రాజధానుల ఇష్యూ

అమరావతి నినాదంతో 252వ రోజూ రాజధాని గ్రామాలు మార్మోగాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు, మందడం, వెలగపూడి, నేలపాడు ధర్నా శిబిరాలు హోరెత్తాయి. అమరావతి పరిరక్షణకు న్యాయపోరాటం చేస్తున్న రాజధాని రైతులు క్షేత్రస్థాయిలోనూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన అన్నదాతల పట్ల కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై రైతులు, మహిళలు భగ్గుమన్నారు.

భూములిచ్చింది రాజధాని కోసం... రాజకీయాల కోసంకాదు

author img

By

Published : Aug 26, 2020, 6:06 AM IST

అమరావతి రైతుల ఆందోళనలు

కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే రాజధాని అమరావతి రైతులు నిరసన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో మాదిరిగా నాలుగైదు గ్రామాలు ఒకేచోట కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే నిరసనలు చేపడుతున్నారు. జై అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, మహిళలు నినదించారు. తమ జీవనాధారమైన భూములను రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజధాని కోసం ఇచ్చామని ఇచ్చినందుకు తమకు మిగిలేందేమిటని రైతులు, మహిళలు నిర్వేదం వ్యక్తం చేశారు. ఎకరా భూమిలో పావు వాటా మాత్రమే తమకు ఇచ్చారని.. మిగతా ముప్పావు వాటా భూమిని ప్రభుత్వానికి అప్పగించామని తామెక్కడా పైసా తీసుకోలేదని రైతులు స్పష్టం చేశారు. డబ్బుల కోసం తామెక్కడా భూములు అమ్ముకోలేదని, రాజధాని అమరావతితో రాష్ట్రం బాగుపడుతుందని, భావితరాలకు మంచి జరుగుతుందనే ఆశతోనే ఇచ్చామని రైతులు చెప్పారు. నిరసన పోరాటం చేస్తున్నవారు రైతులు కాదని అధికారపక్షానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలను రైతులు, మహిళలు తిప్పికొట్టారు. క్షేత్రస్థాయికి వచ్చి రైతులమో, కాదో తెలుసుకోవాలని రైతులు, మహిళలు సవాలు విసిరారు. అర్థంలేని ఆరోపణలతో తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయవద్దని రైతులు, మహిళలు వారిని వేడుకున్నారు.

గతంలో కట్టించిన గృహాలు కేటాయించండి

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా అడ్డుపడితే శాసన రాజధానిని కూడా తరలిస్తామని ఓ మంత్రి ఆరోపణలు చేశారని.... అలాంటి వారికి సీఆర్డీఏ చట్టంపై అవగాహన లేదని రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు. పేదలకు భూములిచ్చే పేరుతో రైతులకు, పేదలకు మధ్య ప్రభుత్వం చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాము భూములిచ్చింది రాజధాని కోసమని... రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిలోని స్థానిక పేదలకు నిర్మించిన ప్లాట్లను ఇవ్వాల్సి ఉందని... ఈ ప్రాంతానికి చెందని స్థానికేతరులకు కాదని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో రాజధాని ప్రాంతంలో పేదల కోసం కట్టించినగృహాలను వెంటనే వారికి కేటాయించాలని కోరారు.

తమ నిరసన ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు రాజధాని రైతులు, మహిళలు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా.... అమరావతిని కొనసాగిస్తామని చెప్పేదాకా తమ పోరాటం కొనసాగుతుందని రైతులు, మహిళలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?: శైలజానాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.