ETV Bharat / city

రాజధాని తీర్పు అమలుపై.. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

author img

By

Published : May 5, 2022, 6:05 PM IST

Updated : May 6, 2022, 4:56 AM IST

రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని, అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్​పై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో స్టేటస్ రిపోర్ట్​ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది.

అమరావతిపై తీర్పు..స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి

రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై స్థాయీ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను జులై 12కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని.. ఇందుకు బాధ్యులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలను శిక్షించాలని కోరుతూ యర్రబాలెం గ్రామానికి చెందిన రైతు దోనె సాంబశివరావు, ఐనవోలుకు చెందిన తాటి శ్రీనివాసరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, జీఏడీ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి, అప్పటి న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత, శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, రహదారులు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ పూర్వ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

తీర్పు తర్వాత ఒక్క పనీ చేపట్టలేదు
గురువారం జరిగిన విచారణలో రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. రాజధాని అమరావతిలో కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, మురుగునీటి కాలువలు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఆ ఉత్తర్వులకు లోబడి ఇప్పటి వరకు ఒక్క పనీ చేపట్టలేదని తెలిపారు. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పారు. కోర్టు తీర్పునకు భిన్నంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేస్తూ పనులు పూర్తి చేయడానికి 60 నెలల సమయం కోరారని తెలిపారు. ఆ అఫిడవిట్‌ హైకోర్టు తీర్పును విభేదించేలా, వ్యతిరేకించేలా ఉందని చెప్పారు. ఈ తరహా వ్యవహారశైలి కోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. సీఎస్‌ కేవలం అఫిడవిట్‌ దాఖలు చేశారు తప్ప.. అభ్యర్థనతో అనుబంధ పిటిషన్‌ (ఐఏ) దాఖలు చేయలేదని గుర్తు చేశారు. రాజధాని నిర్మించాలని హైకోర్టు తీర్పు ఇచ్చాక మంత్రి బొత్స సత్యనారాయణ, తదితరులు మీడియాతో మాట్లాడిన విషయాల్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

మాధ్యమాల్లో ఏం మాట్లాడినా మాకు అనవసరం
ధర్మాసనం స్పందిస్తూ.. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడిన దానితో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏమిటనే వ్యవహారాన్నే తాము పరిశీలిస్తామని తెలిపింది. తమ ఆదేశాలు అమలయ్యాయా? లేదా? అన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుపై విమర్శనాత్మక వ్యాఖ్యలు, చర్చలు చేయవచ్చని పేర్కొంది. కోర్టు తీర్పులకు, జడ్జిలకు దురుద్దేశాలు ఆపాదించడం, ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడమే తప్పవుతుందని తెలిపింది. తమకు చట్టంతోనే పని తప్ప మిగతా విషయాలతో సంబంధం లేదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ అభ్యంతరం తెలపగా.. ఆ విషయాన్ని తాము చూశామని ధర్మాసనం పేర్కొంది. తాము ఏ ఉత్తర్వులు ఇస్తున్నామో వినాలని ఏజీకి చెబుతూ స్టేటస్‌ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చదవండి: ఆ పాఠశాలల నుంచే.. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్: సీఎం జగన్

Last Updated : May 6, 2022, 4:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.