రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన జరగనున్న పరిషత్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలింగ్ సామాగ్రి తరలించడం సహా.. పీఓ, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. అటు.. పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఓటు సిరా గుర్తు వేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో చూపుడు వేలుకు వేసిన సిరా.. ఇంకా చెరిగిపోనందున చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాలని ఆదేశించింది. మరోవైపు.. పరిషత్ ఎన్నికల సందర్భంగా 8న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్‌లకు ఆదేశించింది. ఎన్నికలు జరిగే చోట్ల 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేయాలని సూచించింది.
ఇదీ చదవండి: 'పనబాక లక్ష్మిని గెలిపించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి'