ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతి ఉత్సవాలు.. నివాళులర్పించిన ప్రముఖులు - TRIBUTE TO GANDHI AND LAL BAHADUR

TRIBUTE TO GANDHI AND LAL BAHADUR : గాంధీ బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ జయంతి వేళ ఘన నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ 153వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి వేళ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో .. మహానేతల చిత్రపటాలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పూలమాలలు వేసి.. గాంధీ గొప్పతనాన్ని వివరించారు.

Gandhi Jayanthi
Gandhi Jayanthi
author img

By

Published : Oct 2, 2022, 8:02 PM IST

Gandhi Jayanthi : మహాత్మాగాంధీ 153వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహత్మా గాంధీ పిలుపు మేరకు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పెద్దఎత్తున ప్రజలు ఉద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం దిశగా నడిచారని గవర్నర్‌ పేర్కొన్నారు.

స్వాతంత్య్ర యోధులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి అని.. ఆయన వినయశీలి, మృదుస్వభావి అయినప్పటికీ బలమైన నాయకుడని గవర్నర్‌ అన్నారు. "జై జవాన్ జై కిసాన్" అని పిలుపునిచ్చి.. సరిహద్దులను కాపాడాలని.. సంక్షోభ సమయంలో దేశానికి,జవాన్లకు అవసరమైన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని రైతులకు పిలపునిచ్చారన్నారు.

JAGAN : జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీ చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలు జల్లి ఆయనను స్మరించుకున్నారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరూ ఆదర్శవంతమైన ఆలోచనలతో సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చేందుకు పాటుపడ్డారని కొనియాడారు.

  • Fondly remembering two noble personalities of India, father of the nation Mahatma Gandhi and former Prime Minister Lal Bahadur Shastri on their Jayanti. Their ideals and thoughts for the greater good of society will eternally resonate in every stride our nation makes to progress.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CHANDRABABU : జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్ శాస్త్రిల జన్మదినం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​లు నివాళులర్పించారు. ఆ మహనీయులు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మానవుడిని మహాత్మునిగా చేసే సద్గుణాలను తన జీవితం ద్వారా ప్రపంచానికి అందించిన ఉన్నతుడు గాంధీజీ అని చంద్రబాబు అన్నారు. నైతికతే బలంగా ప్రతి సమస్యపై పోరాడి గెలిచిన సత్యాగ్రహి అని పేర్కొన్నారు. గాంధీ జీ జయంతి సందర్భంగా... ఆ మహానుభావుడు ఆశించిన అహింసాయుత, శాంతి సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

  • మానవుడిని మహాత్మునిగా చేసే సద్గుణాలను తన జీవితం ద్వారా ప్రపంచానికి అందించిన ఉన్నతుడు గాంధీజీ. నైతికతే బలంగా ప్రతి సమస్యపై పోరాడి గెలిచిన సత్యాగ్రహి గాంధీజీ జయంతి సందర్భంగా... ఆ మహానుభావుడు ఆశించిన అహింసాయుత, శాంతి సమాజం కోసం కృషి చేద్దాం.#MahatmaGandhi pic.twitter.com/xyVHcxLA7J

    — N Chandrababu Naidu (@ncbn) October 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

LOKESH : సత్యం, అహింసకు మించిన ఆయుధాలు లేవంటూ ప్రపంచ శాంతికి బాపూజీ మార్గ నిర్దేశం చేశారని లోకేశ్​ తెలిపారు. భారత జాతీయోద్యమంలో స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. జై జవాన్..జై కిసాన్ నినాదంతో ప్రజల్లో స్థైర్యాన్ని నింపిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని ఆయన కొనియాడారు.

SHAILAJA NATH : పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌ అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో.. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు . దేశంలో భాజపా రూపంలో.. ఆర్.ఎస్.ఎస్ సాగిస్తున్న పాలనలో ప్రజలకు స్వాతంత్య్రం లేకుండా చేశారన్నారు. దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఏపీలో ఐదు రోజులపాటు ఆయన పాదయాత్ర ఉంటుందని తెలియజేశారు .

తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సమీపంలోని గాంధీ విగ్రహనికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి నివాళులర్పించారు. కర్నూలు కలెక్టర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.