అఖిల ప్రియను కలిసేందుకు బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్కు వచ్చానని ఆమె సోదరి మౌనిక రెడ్డి చెప్పారు. తన సోదరి ఆరోగ్యం బాగోలేనందున మందులు, ఆహారం తీసుకొచ్చానని తెలిపారు. కానీ పోలీసులు తనను లోనికి అనుమతించలేదన్నారు. కేవలం ఆహారం, మందులు లోనికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.
బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను కూకట్పల్లిలోని ఆమె నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్కు తీసుకెళ్లారు. అఖిల ప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి: