ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు - పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక - WEATHER UPDATE IN ANDHRA PRADESH

వాయుగుండం రేపటికి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం

weather_update_in_andhra_pradesh
weather_update_in_andhra_pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 5:34 PM IST

Weather Update in Andhra Pradesh : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిమీ, నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీ ,పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపటికి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. రానున్న రెండు రోజులలో ఉత్తర వాయవ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

రానున్న 48 గంటలలో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో గాలుల ప్రభావం ఉంటుందని, మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు!

Heavy rains in Nellore District : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయం అయ్యాయి. నగరంలోని తెల్లవారుజామున నుంచి వర్షం కురుస్తోంది. చలి తీవ్రత పెరిగింది. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో భారీ వర్షం కురువగా, బుచ్చి, కోవూరు, విడవలూరు తోపాటు పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం - ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.