రాజధాని అమరావతి అంశంపై ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు... అఖిలభారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధాని విషయంలో సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్న రైతులు, మహిళలపై... జగన్ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాజధాని తరలిపోతుందనే ఆందోళనతో అమరావతి ప్రాంతంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇంత జరుగుతున్నా..ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై రాష్ట్రానికి కేంద్ర పరిశీలన బృందాన్ని పంపాలన్ని హిందూ మహాసభ ప్రతినిధులు అభ్యర్థించారు.
ఇదీ చదవండి