ETV Bharat / city

తన పేరిట మోసం చేస్తున్నారని డీజీపీకి అజేయ కల్లం ఫిర్యాదు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని తన పేరిట మోసాలకు పాల్పడుతున్నారని సీఎం ప్రధాన సలహాదారు అజేయ​ కల్లం​ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో కొందరు వ్యక్తులు తన పేరు వాడుకుని విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని కోరారు.

Ajay kallam
Ajay kallam
author img

By

Published : Oct 21, 2020, 9:33 PM IST

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరిట మోసాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ​ కల్లం​ డీజీపీ గౌతమ్ సవాంగ్​కు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్​మెన్​ల ఉద్యోగాలు ఇప్పిస్తామని మంగళగిరిలో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని అజేయ కల్లం​ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లోను ఈ సమాచారాన్ని విస్తృతం చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

డీజీపీకి అజేయ కల్లం ఫిర్యాదు
డీజీపీకి అజేయ కల్లం ఫిర్యాదు

ఇదీ చదవండి : పెళ్లి సంబంధం పేరుతో మోసం..ఎన్​ఆర్​ఐ యువకుడికి షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.