రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులు, నీటిపారుదల, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు ఏఐఐబీ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టులు నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ వివరించగా... ఒక పోర్టుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.
గోదావరి –కృష్ణా నదుల అనుసంధాన వివరాలను సీఎం జగన్ ఏఐఐబీ ప్రతినిధులకు తెలియజేశారు. నవరత్నాలు సహా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. ప్రజలు కేంద్రంగా కార్యక్రమాలను 20 ఏళ్ల తర్వాత మళ్లీ చూస్తున్నట్లు చెప్పారు. ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు.
ఇదీ చదవండీ...