ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి సంబంధించిన సలహాదారును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీలోని ఎయిమ్స్ మాజీ వైద్యుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని ప్రజారోగ్య సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగాధిపతిగా శ్రీనాథరెడ్డి పని చేశారు. రెండు సంవత్సరాల కాల వ్యవవధితో ఆయన్ను సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: కరోనాపై పోరు: కేంద్రానికి సుప్రీం 24 గంటల గడువు