Schools Reopens in Adilabad : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పిల్లలంతా బడి బాట పట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి విజృంభిస్తున్నా.. కేసీఆర్ సర్కార్ ఈ ఏడాది వెనక్కి తగ్గలేదు. మహమ్మారిని తరిమికొట్టడానికి సరైన జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని బడికి పంపిస్తామని తెగేసి చెప్పింది. అందుకే దాదాపు రెండేళ్ల తర్వాత జూన్‌లో పాఠశాలలను తెరిచింది.
వేసవి సెలవులు ముగించుకున్న పిల్లలంతా ఇవాళ ఉదయాన్నే ఉత్సాహంగా పాఠశాలలకు బయలుదేరారు. చాలా రోజుల తర్వాత తమ స్నేహితులను కలుసుకున్న వారితో బడులన్నీ కిటకిటలాడాయి. దాదాపు రెండేళ్ల తర్వాత పాఠశాల ప్రాంగణాల్లో ప్రార్థనా గీతాలు వినిపించాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ విద్యార్థులను దిగబెట్టడానికి వారి తల్లిదండ్రులు కూడా తోడుగా వెళ్లారు.
తన కుమారుడు సారంగ్‌ను పాఠశాలలో దిగబెట్టడానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వయంగా వెళ్లారు. బాబు తరగతిగదిలోకి వెళ్లనని మారాం చేస్తూ కాసేపు ఏడ్చాడు. ఆ చిన్నారిని బుజ్జగించడానికి కలెక్టర్‌కు చాలా సమయమే పట్టింది. ఎట్టకేలకు అమ్మ మాట విని సారంగ్ క్లాస్‌కి వెళ్లాడు. విద్యార్థులతో పాఠశాల ఆవరణలు సందడిగా మారాయి. కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులను బుజ్జగించడానికి టీచర్లు నానాతంటాలు పడాల్సి వచ్చింది.
ఇదీ చదవండి :
"కరగని నైరుతి మేఘం.." ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా..?
ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు.. ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు: సీఎం జగన్
సినిమా ఏ భాషదైనా లిప్ సింకైపోద్ది.. ఈ టెక్నాలజీతో అట్లుంటది మరి..!