ETV Bharat / city

విద్యుత్తు నగదు బదిలీ నిబంధనల్లో స్పష్టత కరవు - new meters for agriculture bores latest news

ఉచిత విద్యుత్‌కు మీటర్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతోనే ఆందోళనలో ఉన్న రైతులకు వాటి సంరక్షణ... కొత్త చిక్కులు తెచ్చిపెట్టబోతోంది. మీటర్ల ఏర్పాటు వ్యయాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ... కాలిపోయినా లేక చోరికి గురైతే పరిస్థితేంటనే ప్రశ్న వేధిస్తోంది. వీటి భారాన్ని ఎవరు భరించాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో... భవిష్యత్‌లో రైతులే మోయక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Additional Expenditure for farmers in ap with new meters
విద్యుత్తు నగదు బదిలీ నిబంధనల్లో స్పష్టత కరవు
author img

By

Published : Sep 7, 2020, 5:41 AM IST

ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ కోసం... ఇన్‌ఫ్రారెడ్‌ సమాచార ప్రామాణికం (ఐఆర్​డీఏ) మీటర్లును ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యుత్‌ శాఖ అధికారులు లెక్కల ప్రకారం వ్యవసాయ కనెక్షన్లకు కనీసం ఒక్కక్క మీటరు ధర 2 వేల రూపాయలు ఉంటుంది. దీని ప్రకారం 17లక్షల 54వేల విద్యుత్‌ కనెక్షన్ల ఏర్పాటుకు 350కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుంది.

ఎక్కువ శాతం రైతులు పొలాల్లో మీటర్లను బహిరంగంగా చిన్న పెట్టల్లో అమర్చుతారు. ఇవి చెడిపోతే మరమ్మతు వ్యయాన్ని విద్యుత్‌ శాఖ భరిస్తుంది. మొదటిసారి మీటరు కాలినప్పుడు మాత్రం డిస్కంలు కొత్తవి ఏర్పాటు చేస్తాయి. తర్వాత నుంచి ఖర్చు రైతుపైనే పడుతుంది. నిర్మానుష్యంగా ఉండే పొలాల్లో ఏర్పాటు చేసే మీటర్లు చోరికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీటరు చోరీ అయితే కొత్తది ఏర్పాటు చేయటానికయ్యే ఖర్చును రైతే భరించాలి. సింగిల్‌ ఫేజ్‌కు 950 రూపాయలు, త్రీఫేజ్‌కు 2250 రూపాయల వంతున చెల్లించాల్సి ఉంది. మీటరు కాలినా చోరీ అయినా కొత్త మీటర్లు ఖర్చును ఎవరు భరించాలనే అంశంపై తాజా ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు. ఈ భారం రైతుపైనే పడే అవకాశాలున్నాయి.

డిస్కంలకూ ఆర్థిక భారం..

నగదు బదిలీ అమలుతో అసలే నష్టాల్లో ఉన్న డిస్కంలపై మరింత ఆర్థిక భారం పడనుంది. ప్రతినెలా విద్యుత్‌ రీడింగ్‌ నమోదు చేసే కాంట్రాక్టు సంస్థకు ఒక్కొక్క బిల్లుకు పట్టణ ప్రాంతాల్లో రూ.5.76, గ్రామీణంలో రూ.5.96 చొప్పున చెల్లిస్తున్నారు. రహదారి ఇతర అన్ని సదుపాయాలున్న చోటే ప్రతినెలా లక్ష్యం మేరకు బిల్లులను తీయడం సాధ్యం కాదని కాంట్రాక్టు సంస్థలు పేర్కొంటున్నాయి.

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల రీడింగ్‌ నమోదుకు వెళ్లడానికి రహదారి వసతి ఉండదు. పొలాల్లోకి వెళ్లి సేవలందించేందుకు కాంట్రాక్ట్‌ సంస్థలు ఎంతవరకు సహకరిస్తాయోనని డిస్కంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కొక్క బిల్లుకు కనీసం రూ.10 చొప్పున చెల్సించాల్సి వస్తుందని భావిస్తున్నాయి. ఈ లెక్కన ఏటా రూ.21కోట్ల అదనపు భారం పడుతుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండీ... మీటర్ల ఏర్పాటుతో ఏ ఒక్క రైతుకూ నష్టం వాటిల్లదు: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.