ETV Bharat / city

Adani Group: రాష్ట్రంలో అదానీకి.. జాతీయ రహదారి ప్యాకేజీలు - ఏపీలో హైవే ప్రాజెక్టులు చేజిక్కించుకున్న అదాని గ్రూప్​

Adani Group: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఓటీ (నిర్మించు-నిర్వహించు-బదిలీ) పద్ధతిలో రెండు జాతీయ రహదారి ప్యాకేజీలను నిర్వహిస్తున్న స్వర్ణ టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌టీపీఎల్‌)ను, అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఏఆర్‌టీఎల్‌) సొంతం చేసుకోనుంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. స్వర్ణ టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది.

Adani Group
అదాని గ్రూప్​కు జాతీయ రహదారి ప్రాజెక్టు
author img

By

Published : Aug 5, 2022, 10:20 AM IST

Adani Group: ఆంధ్రప్రదేశ్‌లోని 16వ నెంబరు (చెన్నై-కోల్‌కతా) జాతీయ రహదారి (హైవే) లో తడ- నెల్లూరు మధ్య 110 కిలోమీటర్ల మార్గాన్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. అదేవిధంగా 65వ నెంబరు (విజయవాడ-హైదరాబాద్‌) జాతీయ రహదారిలో నందిగామ- ఇబ్రహీంపట్నం - విజయవాడ మధ్య 48 కిలోమీటర్ల ప్యాకేజీ కూడా ఈ సంస్థ కింద ఉంది. స్వర్ణ టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, మెక్వారీ ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ అనే విదేశీ పెట్టుబడుల సంస్థ చేతిలో ఉంది. మెక్వారీ నుంచి మొత్తం వాటాను కొనుగోలు చేయడం ద్వారా స్వర్ణ టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ను అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంటోంది.
దీంతో పాటు గుజరాత్‌లోని గుజరాత్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ లిమిటెడ్‌ (జీఆర్‌ఐసీఎల్‌) లో 56.8 శాతం వాటాను మెక్వారీ ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ నుంచి అదానీ గ్రూపు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. జీఆర్‌ఐసీఎల్‌, గుజరాత్‌ రెండు జాతీయ రహదారి ప్యాకేజీలు నిర్వహిస్తోంది.
విలువ రూ.3,110 కోట్లు: స్వర్ణ టోల్‌వే ప్రైవేట్‌ లిమిటెడ్‌, జీఆర్‌ఐసీఎల్‌కు కలిపి ప్రస్తుతం రూ.3,110 కోట్ల సంస్థాగత విలువ ఉన్నట్లు, ఈ విలువ ప్రకారం ఈ సంస్థల్లో మెక్వారీ ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌కు ఉన్న వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని పేర్కొంది. దీంతో అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ కింద 5,000 కిలోమీటర్ల కంటే పైగా రోడ్డు ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియో ఉన్నట్లు అవుతుంది. తద్వారా దేశ మౌలిక వసతుల నిర్మాణంలో తాము క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోందని అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సీఈఓ కృష్ణ ప్రకాష్‌ మహేశ్వరి వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.