ETV Bharat / city

తెలంగాణ మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలపై.. రాష్ట్రంలో వాడివేడి చర్చ

AP Leaders Discussion on KTR Comments: ఆంధ్రప్రదేశ్​పై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. కేటీఆర్​ వ్యాఖ్యలను వైకాపా నేతలు ఖండించగా.. ఆ వ్యాఖ్యలల్లో అవాస్తవాలు ఏమున్నాయని.. నిజమే చెప్పారని విపక్షాలు అంటున్నాయి.

తెలంగాణ మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలపై.. రాష్ట్రంలో వాడివేడి చర్చ
Reaction ktr comments
author img

By

Published : Apr 30, 2022, 6:53 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలపై రాష్ట్రంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్​ వ్యాఖ్యలను విపక్ష పార్టీల నాయకులు సమర్థించగా.. అధికార పార్టీనేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏపీలోనే కరెంట్ కోతలు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఫైర్​: కేటీఆర్​ వ్యాఖ్యలపై కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ముఖ్యమని.. కేటీఆర్ ఎందుకు అలా మాట్లాడారో తెలియదన్నారు. ఏపీలో కరెంట్​, నీళ్లు, రోడ్లు సరిగా లేవని ఎవరు చెప్పారో పేరు చెప్పాలని కేటీఆర్​ను కోరారు. ఏపీలోని నాడు నేడులో ఉన్న పాఠశాలలు, ఆస్పత్రులు..తెలంగాణలో ఉన్నయా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

కేటీఆర్ వాస్తవాలే చెప్పారు: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవాలు ఏమున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, విద్యుత్ చార్జీలు, కోతలపై కేటీఆర్ వాస్తవాలే చెప్పారన్నారు. ఇదే విషయాన్ని మేం పదేపదే చెప్పినా స్పందించని మంత్రులు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మూకుమ్మడిగా మైకుల ముందుకొచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.

పక్క రాష్ట్రాలతో పోల్చితే ఈ రాష్ట్రంలో ప్రతి వస్తువుపై ధరలను విపరీతంగా పెంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలను పెంచుతూ ప్రజలను హింసిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు విద్యుత్ ఉండాల్సిన రాష్ట్రంలో కోతలు ఎందుకు చేయాల్సి వస్తుందని నిలదీశారు. పెంచిన ధరలు, విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. మే 9న సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

కేటీఆర్‌ ఏపీకి వస్తే ఎం చూపిస్తారు: కేటీఆర్‌ మాటలను బట్టే ఏపీ ఎటుపోతుందో అర్థమవుతోందని తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. కేటీఆర్‌ మాట్లాడిన వాస్తవాలపై రాష్ట్ర మంత్రులు బుకాయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పక్క రాష్ట్ర ప్రభుత్వం సైతం సీఎం జగన్‌ను చేతగానివాడిగా చూస్తోందని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగడంతోపాటు పోలవరం, అమరావతి నిర్మాణాలు ఆగిపోయాయని కొల్లు రవీంద్ర ఆక్షేపించారు.

కేటీఆర్‌ ఏపీకి వస్తే.. మూసేసిన అన్నాక్యాంటిన్‌లు, పడకేసిన పోలవరం, బాబాయిని చంపిన బాత్రూమ్‌, తాడేపల్లి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌, ఆస్పత్రుల్లో సెల్‌ఫోన్‌లైట్ల వెలుగుతో జరిగే వైద్యం చూపిస్తారా అని వైకాపా నేతలను ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు నిలదీశారు. జగన్‌ రెడ్డి కమీషన్లను తట్టుకోలేక పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి పారిపోతే.. అమరావతి ప్రాంతంలో పిచ్చిమొక్కలు మొలిశాయన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఆత్మహత్యకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. మూడేళ్ల వైకాపా పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయి.. రాజధాని పేరుతో విశాఖలో భూకబ్జాలు ఎక్కువ ఎక్కువ కాగా.. సహజవనరులను వైకాపా నేతలు కొల్లగొట్టారని ఆయన ఆక్షేపించారు.

రాష్ట్రంలో దారిద్రపు రాజకీయ పాలన: రాష్ట్రంలో దారిద్రపు రాజకీయ పాలన సాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన భాజపా రాయలసీమ జోనల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, ప్రజలు నష్టపోతూ ఉంటే...ముఖ్యమంత్రి 65 మార్కులు ఏవిధంగా వేసుకున్నారో చెప్పాలన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అన్నారు. ఇక్కడి ప్రజలు కరెంట్​, నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని గుర్తుచేశారు. జగన్​ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రానున్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

ఏపీ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు.. మండిపడ్డ రాష్ట్ర మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.