తొమ్మిది నెలల పాలనలో బలహీన వర్గాల కోసం వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ పథకాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీల రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెదేపా కేసు వేసిందంటూ మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేసున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకు అండగా ఉన్నది బీసీలేనన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. న్యాయస్థానం చెప్పిందని బీసీల రిజర్వేషన్ తగ్గిస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు.
తప్పు చేయాల్సిన అవసరం లేదు..
ఇఎస్ఐలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. ఎలాంటి తప్పు చేయకున్నా కోట్ల రూపాయల కుంభకోణం చేసినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.
ఇదీ చదవండి : 'ఆ బిల్లులను మళ్లీ ప్రవేశపెడితే.. అదే పరిస్థితి'