షీ టీమ్స్ వాహనాలకు వైకాపా జెండా రంగులు వేయడమే కాకుండా ప్రభుత్వ అధికారే వాటిని ప్రారంభించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. ఈ విషయమై డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. మహిళల రక్షణ కోసం తెదేపా ప్రభుత్వం షీ టీమ్స్‌ను బలోపేతం చేసి దాదాపు 800 వాహనాలకు పైగా సమకూర్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వాహనాలకే వైకాపా రంగులు అద్ది తిరిగి పంపిణీ చేశారని ఆయన లేఖలో ఆరోపించారు.
ఇలా రంగుల కోసమే 3 వేల 500 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారని అచ్చెన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే రంగుల విషయంలో ప్రభుత్వ చర్యలను సర్వోన్నత న్యాయస్థానం ఎండగట్టిందని గుర్తు చేశారు. రాత్రింబవళ్లు శాంతిభద్రతలను సంరక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకు రాజకీయ ముద్ర వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వాహనాలకు రంగులు వేసి ప్రచార రథాలుగా మార్చారని, ప్రజలంతా పోలీసు వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసే విధంగా ఈ చర్య ఉందని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: