ETV Bharat / city

మంత్రి శ్రీనివాస్​ గౌడ్​కు భద్రత పెంపు.. పోలీసు కస్టడీకి నిందితులు - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర

Police custody for accused in conspiracy to minister murder case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర బయటపడటంతో ఇంటిలిజెన్స్​ ఉన్నతాధికారులు ఆయనకు భద్రత పెంచారు. గ్రేహౌండ్స్ పోలీసులతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధుల్లో ఉంటారు. మరో నలుగురు ప్రత్యేక పోలీసులు భద్రతగా ఉంటారు.

మంత్రి శ్రీనివాస్​గౌడ్​
మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Mar 7, 2022, 10:48 PM IST

Police custody for accused in conspiracy to minister murder case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర బయటపడటంతో ఇంటిలిజెన్స్​ ఉన్నతాధికారులు ఆయనకు భద్రత పెంచారు. గ్రేహౌండ్స్ పోలీసులతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధుల్లో ఉంటారు. మరో నలుగురు ప్రత్యేక పోలీసులు భద్రతగా ఉంటారు. శ్రీనివాస్ గౌడ్​ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు ఇటీవల ఛేదించారు. మహబూబ్​నగర్​ పట్టణానికే చెందిన ఏడుగురు కలిసి మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితుల నుంచి 2 తుపాకులు, బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కస్టడీకి నిందితులు

శ్రీనివాస్​ గౌడ్​​ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితులను మేడ్చల్​ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. పోలీసులు 10 రోజుల పాటు కస్టడీకి కోరగా.. కోర్టు నాలుగు రోజులకు అంగీకరించింది. రేపట్నుంచి 4 రోజుల పాటు పేట్​ బషీరాబాద్​ పోలీసులు నిందితులను విచారించనున్నారు. వీడియో రికార్డింగ్​ మధ్య విచారణ జరగనుంది. కుట్ర కేసుపై వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేయనున్నారు.

వాటిపై ఆరా

మంత్రి హత్యకు కుట్రలో ఎవరెవరి పాత్ర ఉంది.. 15 కోట్ల రూపాయల సుపారీకి సంబంధించిన వివరాలు రాబట్టనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ హత్యాయత్నం ఘటనతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు.. కుట్ర వివరాలు బయటపడ్డాయి. సుచిత్ర కూడలిలో ఫరూఖ్‌, హైదర్‌ అలీ అనే వ్యక్తులపై ఫిబ్రవరి 25న హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో నిందితులు యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌లను అరెస్టు చేసి.. హత్యాయత్నంపై ప్రశ్నిస్తున్న క్రమంలో కుట్ర కోణం బయటపడింది.

ఇదీ చదవండి: అడవుల్లో ఆయుధాలు.. మంత్రి హత్య కుట్ర కేసులో విస్తుగొలిపే అంశాలు

మంత్రి స్పందన

హైదరాబాద్​లో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్​.. హత్యకు కుట్ర కేసుపై స్పందించారు. ఆ కేసు కోర్టులో పరిధిలో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని గుర్తుచేసిన ఆయన.. పలు కీలక కేసులను పరిష్కరించిన సత్తా మన పోలీసులకు ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Bhatti on assembly sessions: సభాపతికి నిబంధనలు తెలియకపోవడం దురదృష్టకరం: భట్టి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.