పాదయాత్రలో జగన్ మాయమాటలు చెప్తే బలహీన వర్గాల్లో చీలిక వచ్చి వైకాపాకు ఓటు వేశారని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. 9 నెలల పాలనలో బలహీన వర్గాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలకు ఎంతో లబ్ధి చేకూర్చే చంద్రన్న బీమా, పెళ్లికానుక వంటి పథకాలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 2013లో సుప్రీంకోర్టు 60.55శాతం రిజర్వేషన్లకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. తాను అనుకున్నది చేయాలనుకునేందుకు 5కోట్ల రూపాయలతో న్యాయవాదిని పెట్టిన జగన్.. బీసీ రిజర్వేషన్ విషయంలో ఎందుకలా చేయడం లేదని నిలదీశారు.
ఇవీ చదవండి.. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: చంద్రబాబు