ETV Bharat / city

ఆధార్ కార్డు చూపిస్తే.. టీకా వేసేస్తారు! - దీర్ఘకాలిక రోగాలా టీకాలు న్యూస్

ఎంపిక చేసిన దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి.. టీకా వేయించుకోవాలంటే ఎంతో ప్రయాసపడేవారు. అధికారులు ఇప్పుడు ఆ కష్టాన్ని తగ్గించేశారు. వ్యాధి ఉన్నట్లు రక్త పరీక్షలు వంటి ఏదైనా ఆధారానికి తోడు.. ఆధార్ కార్డు చూపిస్తే.. వెంటనే టీకా వేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.

aadhar card
ఆధార్ కార్డు
author img

By

Published : Mar 9, 2021, 8:51 AM IST

ఇకపై ఆధార్‌ కార్డు చూపిస్తే చాలు టీకా వేసేస్తారు. ఎంపిక చేసిన 20 దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏదో ఒక జబ్బు ఉన్నట్లు.. మందుల చీటీ, రక్త పరీక్షల రిపోర్టులు, ఇతర ఆధారాలు ఏది చూపినా పంపిణీ కేంద్రాల్లో టీకా ఇస్తారు. ముందస్తు రిజిస్ట్రేషన్‌ లేకున్నా... లబ్ధిదారులు చూపించిన ఆధారాలతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి... టీకా వేస్తారు.

ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని తెలిపారు. ప్రతి పంపిణీ కేంద్రంలో వైద్యులు తప్పనిసరిగా ఉంటారని వెల్లడించారు. నేటి నుంచి (09-09-2021) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో టీకా వేస్తారన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.