తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణ హత్య జరిగింది. ఖైత్లాపూర్‌లో పాలవ్యాపారం చేసుకునే శ్రీకాంత్(26)ను అతని స్నేహితుడే చంపేశాడు. ఈనెల 1నుంచి శ్రీకాంత్ కనిపించట్లేదని అతని కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాల్‌డేటా ఆధారంగా..
పలు విధాలుగా కేసు దర్యాప్తు కొనసాగించిన పోలీసులకు.. కాల్‌డేటాలో అసలు విషయం చిక్కింది. మృతుడి కాల్‌డేటాను కూడా పరిశీలించడంతో.. ఓ మహిళతో ఎక్కువగా ఫోన్లో మాట్లాడినట్టు నిర్ధారణ అయ్యింది. ఆ మహిళ ఎవరని ఆరాతీయగా.. శ్రీకాంత్ మిత్రుడు శ్రీశైలం భార్యగా తేలింది. అంతేకాకుండా.. శ్రీకాంత్ చివరిసారిగా శ్రీశైలంతోనే కనిపించినట్టు తేలడంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో.. శ్రీశైలం నేరాన్ని అంగీకరించాడు.
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే స్నేహితుడిని హత్య చేసినట్టుగా.. నిందితుడు శ్రీశైలం నేరాన్ని అంగీకరించినట్టు కూకట్పల్లి సీఐ నర్సింగ్‌రావు తెలిపారు. ఈనెల 1న ఐడీఎల్ కంపెనీ పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, హత్య చేసినట్లు శ్రీశైలం చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: Honey Trap: బావ.. మరదలు.. ప్రియుడు.. మధ్యలో ఓ సుబ్బు.. వలపు వలతో కోటి కాజేశారు!