ప్రపంచంలో మనల్ని ఎవరు నమ్మినా.. నమ్మకున్నా.. మనం చేసే ప్రతి పనిలో వెంట వచ్చే వాడే మన దోస్త్. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో ఇదే మరో టైప్‌లో ఉంటుంది. మనతో పాటు నాన్న ఎవర్ని అయితే కామన్‌గా కలిపి తిడతారో వాళ్లే మనకి అన్ని. ఇంట్లో చెప్పుకోలేని, చేయలేని చాలా విషయాలు, వేషాలు.. అన్ని వాడి దగ్గరే బహిర్గతం చేస్తాం. "ముందు వాడితో తిరగడం మానేయ్" అని నాన్న ఎంత గట్టిగా తిట్టినా వాడిని వదలం. "నీ వల్లే అంతా ఇలా అయిందిరా" అని మనం వాడిని తిట్టినా వాడు మనల్ని వదలడు. ఇలాంటి బంధాలకు విలువ ఇవ్వడం తప్ప వెల కట్టలేం.. అలాంటి గొప్ప స్నేహితులున్న మీరు ఎంత అదృష్టవంతులో.. మీ స్వచ్ఛమైన స్నేహాన్ని వారికి ఇచ్చి వాళ్లని మీకంటే అదృష్టవంతులుగా చేయండి.
Friendship Day: మాటలకందని స్నేహ బంధం... ఎంతో మధురం..!
ఊహ తెలిసి స్కూల్‌కి వెళ్లడం మొదలు పెట్టాక మీతో పాటు అడుగులేసిన వాళ్లు.. బలపం నుంచి బాక్స్ షేర్ చేసుకున్న జ్ఞాపకాలు.. ఇంట్లో వాళ్లు కొనిచ్చిన సైకిల్ మీద ఇద్దరు కలిసి వెళ్లిన సందర్భాలు.. ఇంటర్లో కలిసి చేసిన అల్లరులు.. డిగ్రీకి వచ్చే సరికి మారిన ఆలోచనలు.. కాలం మారుతున్న కొద్ది పరిణితి చెందడంతో పాటు మైత్రిలో కూడా అనేక మార్పులు.. 'నిక్కర్ నుంచి జీన్స్‌లోకి మారినా.. సైకిల్ నుండి బైక్‌లోకి మారినా.. కాన్వెంట్ నుండి కాలేజ్‌కి మారినా.. నోట్ బుక్ నుండి ఫేస్ బుక్ మారినా... ఏరా పిలుపునుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా... ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా.. ఫీలింగ్ మారునా!' అంటూ ట్యూన్లో కట్టడం ఏమోగాని.. పరిస్థితుల్ని బట్టి మనల్ని గైడ్ చేసే వాడి గుడ్నెస్కు.. ఏం ఇచ్చి రుణం తీర్చుకుంటాం?
ఒక మంచి ఫ్రెండ్ ఒక కోచ్ లాంటి వాడు. ఎక్కడ తప్పు చేశామో చెప్పడంతో పాటు.. ఎలా ఆడాలో కూడా చెప్తాడు. అలా తోడుండి నడిపించే వాళ్లకి ఏం ఇవ్వగలం.. స్వచ్ఛమైన స్నేహాన్ని తప్ప. చేసిన తప్పును ఇంట్లో వాళ్ల కంటే ముందే క్షమించేసే మిత్రుడికి ఏం ఇవ్వగలం మనసు నిండా వాడిపై నింపుకున్న మమకారాన్ని తప్ప.
FRIENDSHIP DAY 2021: ఒంటరైనా... ఓటమైనా వెంట ఫ్రెండే!
మన లైఫ్‌లో ఒక స్టేజ్ వచ్చే సరికి దోస్తుల మధ్య దూరం పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటికే పండుగొస్తేనే, ఇంకేదైనా పనుంటేనో చుట్టం చూపుగా వెళ్లాల్సి వస్తుంది. మనం వచ్చాం అని తెలుసుకుని మన కోసం ఇంటికి వచ్చే ఫ్రెండ్‌ను "ఏరా ఎలా ఉన్నావ్?" అని నువ్వు అడిగే లోపలే.. "ఏరా వాడు వస్తే తప్ప నీకు మా ఇల్లు గుర్తురాదా?" అని అడిగేస్తుంది అమ్మ. ఎప్పటిలాగే వాడిసైడ్ ఒక రేంజ్లో లుక్ ఇచ్చే నాన్న. ఇవ్వన్నీ నవ్వుతూనే స్వీకరించేది వాడు ఒక్కడే. అయితే వాడిని తిడుతున్న నాన్న చెడ్డవారు కాదు. తిట్టుంచుకుంటున్న వాడు అంతకంటే చెడ్డవాడు కాదు.
బిడ్డ ఎక్కడ చెడిపోతాడో అనే భయం నాన్నదైతే.. జరిగిన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో ముందుగా సూచించే బాధ్యత నేస్తానిదే. ఎంత మంచి స్నేహమైనా దెబ్బతినడానికి చిన్న సందర్భం చాలు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాడు మన మంచికోసమేగా చెప్పింది అనే విషయాన్ని గ్రహిస్తే.. దోస్త్ మేరా దోస్త్ అంటూ ట్యూన్ కట్టుకుంటూ ఖుషీగా ఉండొచ్చు.
ఇవీ చూడండి: