Survey on Schemes: సంక్షేమ పథకాల అమలుపై లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోడానికి వాలంటీర్లతో రాష్ట్రంలో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం రూపొందించిన యాప్.. వాలంటీర్ల మొబైల్ ఫోనులో అప్‌లోడ్ చేసేలా ఆదేశాలు వెలువడ్డాయి. సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు తమ పరిధిలోని వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి యాప్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలి, లబ్ధిదారుల అభిప్రాయాలు మొబైల్‌లో చిత్రీకరించి ఎలా అప్‌లోడ్ చేయాలో వివరిస్తున్నారు. అన్ని జిల్లాల్లో గురువారం నుంచే సర్వే ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఇంకా మిగిలి ఉన్నందున.. శుక్ర, శనివారాల్లో సర్వే ప్రారంభించే యోచనతో ఉన్నారు.
ఇవీ చదవండి: