వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కుట్ర కోణం ఉందని...దానిని ఛేదించాలంటే మరింత లోతుగా దర్యాప్తు చేయాలని...అందుకు ఇంకా సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. కేసు విచారణ కోసం సీబీఐకి మరో 2నెలల గడువు ఇచ్చింది హైకోర్టు. నవంబరు 11న నివేదిక అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నవంబరు16కు వాయిదా వేస్తూ...హైకోర్టు తీర్పునిచ్చింది. విశాఖ ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఇదీ చదవండి: 'కొండపల్లి' తవ్వకాలపై నిగ్గుతేల్చిన కమిటీ...క్వారీ లీజుల రద్దు!