యూట్యూబ్ వీడియోల ద్వారా పరిచయమై, తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ.. ఇద్దరు దివ్యాంగుల వద్ద రూ.30 లక్షలు వసూలు చేశారు కేటుగాళ్లు. చివరకు మొండి చేయి చూపించారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. శ్రీనివాస రావు అనే వ్యక్తి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల రామ్‌నగర్‌కు చెందిన ఇద్దరు దివ్యాంగులకు ఫోన్ చేశాడు. ఇ- వ్యాపారానికి రూ.15 లక్షలు లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. తమ వారికి తగిన పత్రాలు ఇవ్వాలని సూచించాడు.
ఇదీ చదవండి: ఒక్కరాత్రిలో 200 మంది ప్రాణాలు కాపాడిన కరోనా యోధులు
బాధితుల నుంచి ఆధార్ కార్డు ప్రతులు, ఫొటోలను కేటుగాళ్లు తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఫోన్ చేసి వ్యాపారం కోసం కాకుండా రూ.60 లక్షల్లో మంచి ఇల్లు చూసుకోండి సాయం చేస్తామని చెప్పారు. రూ.30 లక్షలు మీరు ఏర్పాటు చేసుకుంటే.. మరో రూ. 30 లక్షలు తాము ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. వారిని పూర్తిగా నమ్మిన దివ్యాంగులు.. ఆ డబ్బును సమకూర్చి వారికి అందజేశారు. చివరకు మోసపోయామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. తమను మోసగించిన వ్యక్తులను అరెస్టు చేసి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: