ETV Bharat / city

తెలంగాణలో.. బ్లాక్​ ఫంగస్ సోకి ఒకరు మృతి

కొవిడ్​ నుంచి కోలుకున్నవారికి.. బ్లాక్​ ఫంగస్ మరో ముప్పుగా మారుతోంది. దేశంలో ప్రస్తుతం ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతువుతున్నాయి. ఇప్పటికే పలువురు ఫంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్రంలోనూ మ్యూకర్​మైకోసిస్ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. తెలంగాణ కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి నిన్న ఫంగస్ ధాటికి బలయ్యాడు.

black fungus
బ్లాక్ ఫంగస్
author img

By

Published : May 17, 2021, 10:17 AM IST

బ్లాక్​ ఫంగస్​తో తెలంగాణ రాష్ట్రంలో మరో మరణం చోటుచేసుకుంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన అంజల్ రెడ్డికి గత నెల 23వ తేదీన కరోనా సోకడంతో.. నిజామాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. 12 రోజుల పాటు చికిత్స పొందిన ఆయన.. కోలుకొని మే 8న డిశ్చార్జి అయ్యారు.

అనంతరం కన్ను ఎర్రబారి ఇబ్బందులు తలెత్తడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు వెళ్లగా.. వారు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సరోజినీ వైద్యులు పరీక్షించి.. బ్లాక్‌ ఫంగస్‌ సోకి ఉండొచ్చని భావించి కేర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. మే 11న అంజల్‌రెడ్డి కేర్‌ ఆసుపత్రిలో చేరారు. బ్లాక్‌ఫంగస్‌ సోకినట్లు నిర్ధారించిన వైద్యులు.. ఆయనకు ఓ కన్ను, దవడ తొలగించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. అతను మృతి చెందాడు.

ఇదీ చదవండి:

'ఈ' - హుండీతో.. దేవాలయాలకు ఆర్థిక పరిపుష్టి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.