ETV Bharat / city

HEAVY RAIN IN TS: స్కూటీతో సహా వాగులో పడిన వ్యక్తి.. స్థానికుల సాహసం! - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ శివారులో వాగు ప్రవాహం అంచనా వేయలేక ఓ వ్యక్తి స్కూటీతో సహా వాగులో పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను కాపాడారు. గులాబ్ తుపాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా బీభత్సం(heavy rain in nizamabad) సృష్టిస్తోంది.

heavy rain in nizamabad
a man fell in floods
author img

By

Published : Sep 28, 2021, 4:41 PM IST

స్కూటీతో సహా వాగులో పడిన వ్యక్తి.. స్థానికుల సాహసం!

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ శివారులోని ఖానాపూర్ రహదారి పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఒకరు పడిపోగా స్థానికులు(scooty washed away in floods) కాపాడారు. వాగు ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేక... ఓ వ్యక్తి స్కూటీతో దాటుతుండగా వాగులో పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని అతికష్టం మీద తాడు సాయంతో కాపాడారు. స్కూటీని సైతం బయటకు తీశారు.

వాన బీభత్సం

మరోవైపు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా గులాబ్ తుఫాన్ బీభత్సాన్ని(heavy rain in nizamabad) సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో..... రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల వరద నీటిలో వాహనాలు చిక్కుకుపోయాయి. కామారెడ్డి మండలం లింగాపూర్ చెరువు అలుగు ప్రవాహంలో గ్రామానికి చెందిన పందిరి భగవాన్ రెడ్డి ద్విచక్రవాహనంతో పాటు కొట్టుకుపోయారు. 2 గంటల గాలింపు చర్యల అనంతరం మత్తడిలో మృతదేహం లభించింది. మాచారెడ్డి మండలం పరిధిలోని పేట చెరువు ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ ప్రవాహంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు తాళ్లు, ట్రాక్టర్ సాయంతో సురక్షితంగా బయటకు తీశారు.

గులాబ్ పంజా

సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులోని వాగు ప్రవాహంలో సెంట్రింగ్ చెక్కలతో వెళ్తున్న వాహనం చిక్కుకుంది. ఆ సమయంలో వాహనంలో ఐదుగురు భవన నిర్మాణ కార్మికులు ఉండగా సుమారు గంట పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరకయాతన అనుభవించారు. స్థానికులు గమనించి ట్రాక్టర్, తాళ్ల సహాయంతో వాహనాన్ని బయటకు తీయడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.

మూడు రోజుల పాటు వర్షాలు

ఇదిలాఉండగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (hyderabad imd weather report)) ప్రకటించింది. నేడు నిజామాబాద్‌, నిర్మల్‌, అదిలాబాద్, కామారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం నాడు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం మంగళవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు విదర్భ పరిసర ప్రాంతాల్లో.... నాగపూర్‌కు నైరుతి దిశగా 250 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 6 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

Accident: నర్సీపట్నంలో కారు బీభత్సం... మైనర్​ డ్రైవింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.