అదుపుతప్పి మొదటి అంతస్తు నుంచి ట్రాన్స్ఫార్మర్పై పడిన ఓ వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రాణాలతో బతికిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.
పట్టణానికి చెందిన మంజునాథ్(38) కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలో నివసిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి అదుపుతప్పి కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాడు. ఈ సమయంలో విద్యత్ తీగ తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
శస్త్ర చికిత్స తారుమారు.. ఒకరికి బదులు మరొకరి పొట్టకోసిన వైద్యులు