తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై ఓ రైతు పెట్రోల్ చల్లాడు. సీనియర్ అసిస్టెంట్ రామచందర్, వీఆర్వో అనిత, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, అటెండర్ దివ్యపై పెట్రోల్ దాడి చేశాడు.
అన్నదమ్ముల మధ్య భూవివాదం...
లంబాడిపల్లెకు చెందిన కనకయ్య కొంతకాలంగా తన భూమికి పట్టా చేయాలని రెవెన్యూ కార్యాలయానికి వస్తున్నాడు. తన భూమిని పట్టా చేయాలని అధికారులను విన్నవిస్తున్నాడు. కాలయాపన జరగడంతో ఆగ్రహించి పెట్రోల్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా... అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా చేయడం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
క్రిమినల్ కేసులు తప్పవు...
రెవెన్యూ సిబ్బందిపై కనకయ్య పెట్రోల్ చల్లిన విషయాన్ని జాయింట్ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్... కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలియజేశారు. వెంటనే అతనిపై క్రిమినల్ కేసు నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు కనకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య