ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

.

author img

By

Published : Jun 24, 2020, 9:31 PM IST

ప్రధాన వార్తలు @9pm
ప్రధాన వార్తలు @9pm
  • 3 రోజుల అనిశా కస్టడీకి అచ్చెన్నాయుడు
    అచ్చెన్నాయుడిని 3 రోజులపాటు అనిశా అధికారుల కస్టడీకి అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. మూడ్రోజులపాటు అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే విచారించాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడితో పాటు ఇదే కేసులో ఎ1గా ఉన్న రమేష్‌ కుమార్‌నూ అధికారులు విచారించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎంపీ రామ్మోహన్​ నాయుడుకు సంసద్ రత్న అవార్డు
    పార్లమెంట్​లో గుక్కతిప్పుకోకుండా హిందీలో అనర్గళంగా మాట్లాడగల దిట్ట. అతి చిన్న వయస్సులోనే ఎంపీగా ఎన్నికైన తెదేపా నేత. ప్రత్యర్థులపై ప్రశ్నల వర్షం కురిపించగల మాటకారి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన...అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఇప్పుడు ఆయనను మరో అవార్డు వరించింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఇస్తున్న సంసద్ రత్న అవార్డుకు రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చంద్రబాబు మార్గదర్శ కత్వంలోనే ఆ ముగ్గురి భేటీ..!
    తెదేపా అధినేత చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్​లు సమావేశమయ్యారని.. వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. వారి భేటీ అనైతికమని.. దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వాళ్లు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారు?
    వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. తాము చేసిన ఫిర్యాదులను పట్టించుకోని పోలీసులు, వైకాపా కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే వెంటనే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైనా డీల్​పై చిక్కుల్లో సోనియా, రాహుల్​!
    కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్ హయాంలో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలను దాచిపెట్టడంపై ఈ వ్యాజ్యం వేశారు. దీనిపై ఎన్​ఐఏ, సీబీఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆ నిర్ణయం అమలు చేస్తేనే సరిహద్దులో శాంతి'
    తూర్పు లద్దాఖ్​లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై కుదిరిన అంగీకారాన్ని కఠినంగా అమలు చేయాలని భారత్​-చైనా నిర్ణయించాయి. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఇరు వర్గాలు భావిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయిలో జరిగిన సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది విదేశాంగ శాఖ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా కాలంలో పార్లమెంట్​ సమావేశం ఇలా...
    కరోనా సంక్షోభం ఆరంభమైన తర్వాత... తొలిసారిగా జర్మనీ నార్త్​ రైన్​ వెస్ట్‌ఫాలియన్​ రాష్ట్రం పార్లమెంట్​ సమావేశం నిర్వహించింది. ప్రత్యేకమైన గాజుతో తయారు చేసిన పెట్టెల్లో చట్టసభ్యులు భేటీ అయ్యారు. వైరస్​ భయంతోనే ఈ వినూత్న ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జియోలో ఫేస్​బుక్ పెట్టుబడికి సీసీఐ ఆమోదం
    జియో ప్లాట్​ఫాంలో ఫేస్​బుక్​ పెట్టుబడులకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం లభించింది. జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలు చేయడాన్ని ఆమోదిస్తూ సీసీఐ ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​తో సిరీస్ యాషెస్​తో సమానం: లైయన్​
    భారత్​తో టెస్టు సిరీస్​ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు ఆస్ట్రేలియా క్రికెటర్​ నాథన్​ లైయన్​. యాషెస్​ సిరీస్​ లాగే టీమిండియాతో సిరీస్​ కూడా ఆసక్తికరంగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సుశాంత్‌ పోస్ట్‌మార్టం నివేదికలో ఏం తేలిందంటే!
    బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర పరిశ్రమ వర్గాలు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. గత ఆరు నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించిన తుది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను పోలీసులకు వైద్యులు సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.