ETV Bharat / city

ap topnews ప్రధానవార్తలు9am - ఆంధ్రప్రదేస్​ లేటెస్ట్​ న్యూస్​

.

9am topnews
ప్రధానవార్తలు9am
author img

By

Published : Aug 30, 2022, 9:00 AM IST

  • పన్నుల రాబడి.. అప్పులకు సరి

రాష్ట్రంలో పన్నుల రాబడి అప్పులకే సరిపోతోంది. రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 60,000 కోట్లుగా ఉంటే ఏటా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు రూ. 50,000 కోట్లుగా ఉంది. అంటే ప్రభుత్వ ఆదాయాన్ని రుణాలు కమ్మేశాయి. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ తీరుపై ఇప్పటికే కాగ్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. తప్పు, ముప్పంటున్నా రుణాలు తగ్గడం లేదు.

  • పల్లెలకు పనుల్లేవ్‌, పంచాయతీల తీర్మానాలు అటకెక్కినట్లే

గ్రామాల్లో కొత్తగా రహదారులు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన పనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ నిధులు ఈ ఏడాది లేనట్లే! ఇలాంటి అవసరాలకు పంచాయతీలు చేసిన తీర్మానాలను పక్కన పెడుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలు పూర్తిచేశాకే కొత్తవి మంజూరు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.

  • ఏడాదికొక సాక్షిని విచారిస్తున్నారా, సీఐడీపై హైకోర్టు ఆగ్రహం

అవినీతి కేసుల విచారణలో జాప్యాన్ని సహించేది లేదని హైకోర్ట్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు సీఐడీ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలులోని రాయలసీమ వర్సిటీలో కొనుగోళ్లు, చెల్లింపుల విషయంలో విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చినా సీఐడీ విచారణలో పురోగతి లేదని పేర్కొంటూ ఏఐఎస్​ఎఫ్​ నేత కల్లప్ప హైకోర్టులో పిల్ వేశారు. ఇందులో 16 మంది సాక్షుల్ని విచారించామని, కౌంటర్ వేయడానికి సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోరడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.

  • ఉద్యోగాల రాత పరీక్షల తేదీల వెల్లడి

ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పలు ఉద్యోగాలకు నియామక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరపాలని నిర్ణయించింది. అదనపు సమాచారం కోసం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అభ్యర్థులకు సూచించింది.

  • చీమల దండయాత్ర, చూపు కోల్పోతున్న పశువులు, వలస వెళ్తున్న ప్రజలు

చీమలే కదా..! నలిపేస్తే పోతాయని అనుకుంటాం. కానీ అవి లక్షల సంఖ్యలో గుంపులుగా దండెత్తి వస్తే మనుషులు పారిపోవాల్సిందే! తమిళనాట అటవీ ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఇక్కడ చీమలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దండులా దండెత్తుతున్న ఈ చీమలు ఏది కనబడితే దాన్ని తినేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

  • ఇంట్లో బంగారు నిధి, గుట్టుగా పంచుకున్న కూలీలు

పాడుబడిన ఇంటిని తిరిగి నిర్మిస్తుండగా.. పురాతన బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలు బయటపడ్డాయి. అయితే యజమానికి తెలియకుండా కూలీలు ఆ బంగారాన్ని గుట్టుగా పంచుకున్నారు. కానీ తాగిన మైకంలో ఓ వ్యక్తి నోరుజారడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • ఉపవాసం చేసి మరీ బరువు తగ్గిన ఎలాన్​ మస్క్​, అందుకేనా

రుచికరమైన ఆహారాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. తాజాగా తిండిపై శ్రద్ధ పెట్టారట. అంతేకాదు, వ్యాయామం కూడా చేయడానికి ఇష్టపడని ఆయన.. తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్లే ఇటీవల తొమ్మిది కిలోల బరువు తగ్గారట. ఇదే విషయాన్ని స్వయంగా వెల్లడించిన ప్రపంచ కుబేరుడు.. తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు.

  • ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ మృతి

గుండెపోటుతో ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్(72) మరణించినట్లు ఆయన సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అభిజిత్​కు గుండెపోటు వచ్చిందని.. వెంటనే దిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఆసుపత్రికి చేరుకునేలోపే అభిజిత్ సేన్​ ప్రాణాలు కోల్పోయారని ప్రణబ్ వెల్లడించారు.

  • బ్యాట్​ తగిలి మాజీ క్రికెటర్​ విలవిల, వీడియో వైరల్​

టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (క్రిస్) షాట్‌ కొట్టే సమయంలో పొరపాటున మరో మాజీ ప్లేయర్‌ హేమంగ్‌ బదానీ చేతికి బ్యాట్‌ తగిలింది. పాపం నొప్పితో బదానీ విలవిల్లాడిపోయాడు. అదేంటి వీరిద్దరూ ఎప్పుడు క్రికెట్‌ ఆడారు..? ఎక్కడ ఆడారు..? అని కంగారు పడిపోవద్దు..

  • వైష్ణవ్​తేజ్​ నేను అలా చేసేవాళ్లం, ఆ అనుభవాలు అద్భుతం అంటున్న కేతికశర్మ

హీరో వైష్ణవ్​తేజ్​తో తనకున్న అనుబంధాన్ని తెలిపింది యంగ్​ హీరోయిన్​ కేతిక శర్మ. రంగరంగ వైభవంగా సినిమా షూటింగ్​ సెట్​లో తామిద్దరు ఎలా ఉండేవారో వివరించింది. ఇంకా ఏం చెప్పిందంటే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.