- Shallow land in AP : ఇస్రో సర్వేలో ఆసక్తికర విషయాలు.. రాష్ట్రంలో నిస్సార భూమి ఎంతో తెలుసా..!
ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ విడుదల చేసిన సర్వేలో ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77%) భూమి క్షీణతకు గురైనట్లు ఈ సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కున్న 1,60,20,500 హెక్టార్ల భూభాగంలో 14.84% (2.37 మిలియన్ హెక్టార్లు) భూమి ఎడారీకరణకు గురైందనట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
వివేకా హత్య ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి వివేకా హత్య ఘటనకు సంబంధించి కేసు అవసరం లేదని వై.ఎస్.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని అప్పటి సీఐ శంకరయ్య వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CAG ON AP: బడ్జెట్ అనుమతులు లేకుండా చేసిన ఖర్చు 94,399 కోట్లు
బడ్జెట్ కేటాయింపులు లేకుండానే వేలకోట్ల వ్యయం చేయడంపైనా కాగ్ అసంతృప్తి(cag not satisfaction over spending billions in ap ) వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.94 వేలకోట్లకు పైగా ఖర్చుచేశారని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- polavaram height: పోలవరం ఎత్తుపై కొత్త చర్చ
పోలవరం ఎత్తుపై కొత్త చర్చ మొదలైంది. 135 అడుగుల నీటి నిల్వ ఖర్చుపై ఆరా తీసింది కేంద్ర జలసంఘం. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర జలసంఘానికి అందజేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూపీలో నాల్గో దశ పోలింగ్.. ఉదయమే ఓటేసిన మాయావతి
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి 242 మంది భారతీయులు
ఉక్రెయిన్ నుంచి ఎయిర్ఇండియా విమానం భారత్‌కు చేరుకుంది. 242 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిర్ఇండియా విమానం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలో మళ్లీ చైనాకు భారత విద్యార్థులు
బీజింగ్ విధించిన నిషేధంతో రెండేళ్లుగా భారత్‌లోని ఇళ్ల వద్దే ఉండిపోయిన దాదాపు 23 వేలమంది భారత విద్యార్థులు త్వరలో చైనాకు వెళ్లనున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి చైనా హామీ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చమురుకు రెక్కలు.. త్వరలో పెట్రోల్ రేట్ల మోత.. బండి తీయలేమా?
అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరువవుతోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వార్తలు ఈ ధరల మంటకు ఆజ్యం పోస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత 110 రోజులుగా దేశంలో పెట్రోల్ రేట్లలో మార్పు లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Hundred League 2022: మళ్లీ 'ది 100'లో మంధాన, జెమిమా
ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ లీగ్ హండ్రెడ్ టోర్నీలో మన స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమియా రోడ్రిగ్స్ మళ్లీ ఆడనున్నారు. అయితే షెఫాలీవర్మ, దీప్తిశర్మ, హర్మన్ప్రీత్కౌర్ను తమ పాత ఫ్రాంఛైజీలు తిరిగి దక్కించుకోలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'భీమ్లానాయక్' ప్రీ రిలీజ్.. ఫ్యాన్స్‌కు పోలీసులు కీలక సూచనలు
రిలీజ్‌కు సిద్ధమైన 'భీమ్లానాయక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం, అనవసర గొడవలను, తొక్కిసలాటలను నివారించేందుకు పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. అవేంటంటే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.