- visaka accident: జాతీయ రహదారిపై ప్రమాదం...సీఐ ఈశ్వరరావు మృతి
విశాఖలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు జీపును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో త్రీటౌన్ సీఐ ఈశ్వరరావు మృతి చెందాడు. కానిస్టేబుల్ సంతోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా తెల్లవారు జామున 3.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితపై కేసు నమోదు
తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితపై విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు(case registered against TDP leaders ayyanna patrudu, Vangalapudi Anita) చేశారు. చింతలపూడి విజయ్ సహా 16 మందిపై విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రమాదకరం.. అడుగుకో గుంత...గజానికో గొయ్యి .. ఎక్కడంటే..?
అడుగుకో గుంత..గజానికో గొయ్యి...! ఇలాంటి రోడ్లపై ప్రయాణమంటే మామూలు రోజుల్లోనే జనం మావల్ల కాదంటూ వెనకడుగువేస్తారు..! అలాంటిది..ఇప్పుడు అసలే వర్షాలు.. ఇక చెప్పేదేముంది రోడ్లు కాస్తా నరకానికి నకళ్లుగా మారాయి..! తప్పదని బయటికెళ్తే ఒళ్లు హూనం అవుతోంది..వాహనాలు గుళ్లవుతున్నాయి! తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం-అమలాపురం రోడ్డుపై ప్రయాణం అంటేనే.. జనం బెంబేలెత్తుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పంచాయతీల ఖాతాల ఖాళీపై సర్పంచుల ఆవేదన
పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాటాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో సర్పంచులు నిరసన(Sarpanches protest) వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై విశాఖ జిల్లాలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. నిధులు జమచేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొవాగ్జిన్‌తో.. లక్షణాలున్న కరోనా నుంచి 50 శాతం రక్షణ!
భారత్ బయోటెక్ (Bharat biotech covaxin) అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ రెండో దశ మహమ్మారి విజృంభణ సమయంలో మరణాలను గణనీయంగా తగ్గించినట్లు తేలింది. ఈ మేరకు కొవాగ్జిన్ సమర్థతను గుర్తిస్తూ 'ది లాన్సెట్ జర్నల్' (covaxin the lancet) ఓ అధ్యయనాన్ని వెలువరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పేదరిక కట్టడిలో 'ఉపాధి హామీ'.. ఇతోధిక కేటాయింపులే ఊపిరి
నిధుల కొరతతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లక్ష్యాలు(mgnrega target group) నీరుగారిపోతున్నట్లుగా ఇటీవల కథనాలు వెలుగుచూశాయి. కూలీలకు వేతనాలు వంటి వాటిపై 21 రాష్ట్రాల్లో ప్రతికూల ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నట్లుగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- న్యాయపోరాటంతో బిడ్డను దక్కించుకున్న అనుపమ
కేరళకు చెందిన ఓ మహిళ న్యాయపోరాటం ద్వారా తన బిడ్డను దక్కించుకుంది. తన అనుమతి లేకుండా తండ్రి బిడ్డను (Anupama Ajith Child Case) దత్తతు ఇవ్వడంపై అనుపమ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా బుధవారం తీర్పును ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Floating City: వరదను తట్టుకునేలా అలలపై అందాల నగరం!
సముద్రమట్టాలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో సంభవించే వరదల వంటి ముప్పుల నుంచి రక్షించుకునేందుకుగాను నీటి ఉపరితలంపైనే జనావాసాలను సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలో తొలిసారిగా దక్షిణ కొరియాలోని బూసాన్ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని(floating city South Korea) నిర్మించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- హాకీ ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లకు షాక్
జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో(Junior Hockey World Cup 2021) భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫ్రాన్స్ చేతిలో భారత్ 4-5 తేడాతో ఓటమిపాలైంది. భారత్ తరఫున సంజయ్ సాధించిన హ్యాట్రిక్ గోల్స్ వృథా అయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆమిర్‌ఖాన్ తర్వాత ఆ పని చేసింది నేనే'
ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయికి రావడం తన అదృష్టమని చెప్తున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu Movies). 'హృదయ కాలేయం' నుంచి కామెడీ సినిమాలతో అలరిస్తున్న సంపూ.. 'క్యాలీఫ్లవర్' (Sampoornesh Babu New Movie) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి