- నిర్లక్ష్యమే..!
మొలాసిస్ నిల్వ కోసం 53 ఏళ్ల క్రితం కట్టిన ట్యాంకును స్టైరీన్ నిల్వ కోసం ఎల్జీ పాలిమర్స్ సంస్థ వినియోగించిందని.. హైపవర్ కమిటీ ఆక్షేపించింది. ఈ ప్రమాదకర రసాయనాన్ని అంత పురాతన ట్యాంకులో నిల్వచేయడం శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై నివేదికలో కీలక అంశాలు పొందుపరిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మెడికల్ కిట్లు
కరోనా బారినపడి ఇంటి వద్దే చికిత్స పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం హోం క్వారంటైన్ మెడికల్ కిట్లను అందిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 460 కిట్లను బాధితులకు పంపిణీ చేసినట్లు జాయింట్ కలెక్టర్-2 బి.రాజకుమారి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గిరి'జనం' క్షేమం
రాష్ట్రంలో అత్యధిక గిరిజన జనాభా విశాఖ జిల్లాలోనే ఉంది. అయితే పట్టణ జీవనానికి దూరంగా ఉండే గిరిజన ప్రాంతాలకు వచ్చేసరికి వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గిరిజనుల ఆహారపు అలవాట్లు వారికి కొండంత అండగా నిలుస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బోనం.. 'భాగ్య'నగరం
తెలంగాణలో ప్రధానంగా జరపుకునే పండుగల్లో బోనాలు ఒకటి. ఈ బోనాల పండుగ సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో భక్తులు లేకుండానే ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సంస్కారం.. విదారకం
అంతిమ సంస్కారం అనే మాటనే ఇప్పుడు వాడలేని పరిస్థితి ఏర్పడింది. ‘శ్మశానానికి బాధితుల సంబంధీకులు రాకపోవడం, కాటికాపరులు కూడా అంతగా పట్టించుకోకపోవడంతో చాలా మృతదేహాలు పూర్తిగా కాలడం లేదు. సగం కాలిన శరీర భాగాలను శునకాలు పీక్కుతింటున్న హృదయ విదారక దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డ్రాగన్ అకృత్యాలు
ప్రస్తుతం ప్రపంచంలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న దేశమేదైనా ఉందంటే అది ఒక్క రిపబ్లిక్ ఆఫ్ చైనా మాత్రమే. ఇతర దేశాల సమస్యలను ఆసరాగా తీసుకొని పబ్బం గడుపుకుంటోంది చైనా. చైనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలు ఎన్నో. ఇక ఆ దేశం సాగించే అకృత్యాలకు కొదవే లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్'
కరోనా ఔషధాలు, వ్యాక్సిన్ అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీ కొవిడ్-19పై ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో గేట్స్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధోనీ విజయాల వెనుక
టీమ్ ఇండియా మాజీ సారథి ధోనీ తన కెరీర్లో సాధించిన విజయాల వెనుక గంగూలీ కఠోర శ్రమ ఉందని వివరించాడు గౌతమ్ గంభీర్. దాదా నాయకత్వంలో అగ్రశ్రేణి ఆటగాళ్లుగా ఎదిగిన క్రికెటర్లు మహీకి ఎంతో ఉపయోగపడ్డారని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బిగ్ బీ, అభిషేక్‌కు కరోనా
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఈ బాలీవుడ్ నటులు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని అభిమానులను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేవదాస్‌కు 20 ఏళ్లు
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, అందాల తార ఐశ్వర్య రాయ్ నటించిన 'దేవదాస్' చిత్రం విడుదలై నేటితో 20ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం. పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చే ఎన్నో ప్రేమ కథల నడుమ కాలం మరువని కన్నీటి కథగా దేవదాసు ఇంకా ఇప్పటికీ నిలిచి ఉందంటే... అదంతా శరత్ ఇంద్రజాలమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.