ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - 9am top news

...

9 AM Top News
ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 22, 2020, 8:58 AM IST

  • నేడు దిల్లీకి సీఎం జగన్..ప్రధానితో భేటీ!

ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి నుంచి బయల్దేరనున్న జగన్‌...సాయంత్రం 5గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమరావతికి మరోసారి గుర్తింపు

సైకిల్స్‌ 4 ఛేంజ్‌ కార్యక్రమానికి రాజధాని హోదాలో అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రజా రవాణా వ్యవస్థ కింద సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, 5 లక్షల జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్‌ సిటీల్లో తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈనెల 17 నాటికి 107 నగరాలు నమోదు చేసుకున్నాయని అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ సోమవారం రాజ్యసభలో చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజధానిపై విచారణ అక్టోబర్​ 5కు వాయిదా

రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు అక్టోబర్‌ 5కు వాయిదా వేసింది. అనుబంధ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను భౌతికంగా నిర్వహించాలా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా? అవసరమైతే.. రెండు విధానాల్లో జరపాలా? అనే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజధానిలో గుండెపోటుతో రైతు మృతి

అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన సదాశివరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని నిర్మాణం కోసం సదాశివరావు 2.25 ఎకరాల భూమిని ఇచ్చాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • సభాపర్వంలో విలువల హననం- చీకటి దినం!

రైతు ప్రయోజనాలపై ఎత్తిన కత్తిగా బిల్లుల్ని తూలనాడిన పక్షాలు వాటిని సమగ్ర సమీక్ష నిమిత్తం సెలక్ట్‌ కమిటీకి నివేదించాలని లేదా పక్కాగా ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుపట్టాయి. అంతలోనే పరిస్థితులు కట్టుతప్పి, మాన్య సభ్యుల వీరావేశ ప్రదర్శనలు జోరెత్తాయి. ఆ హడావుడిలోనే మూజువాణి ఓటుతో బిల్లులు నెగ్గాయన్న ప్రకటన మౌలిక సందేహాల్ని లేవనెత్తుతోంది. ఈ క్రమంలో ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసిన పరిణామాలు జరిగిన రోజు- ఎగువసభ చరిత్రలో చీకటి దినం!..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చీఫ్‌ జస్టిస్‌, గవర్నర్‌ అంగీకారం తప్పనిసరి

రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు కోసం అక్కడి ప్రభుత్వాలు పంపే ప్రతిపాదనలకు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. దేశంలో ఎక్కడైనా హైకోర్టు బెంచ్​లు ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా అని యూపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు.. మంత్రి‌ సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బహుళ పక్ష విధానంలో సంస్కరణలు అవసరం'

అంతర్జాతీయ బహుళపక్ష విధానంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఐరాస ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు మోదీ. ఐరాసలో సంస్కరణల కోసం సభ్య దేశాలు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రైవేటీకరణపై రఘురాం రాజన్​ కీలక సూచనలు

ఒక మొండి బకాయిల సమస్యలు పరిష్కరించేందుకు ఒక 'మొండి బ్యాంకు'ను ఏర్పాటు చేయాలన్నారు ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్. ప్రైవేటీకరణ, ఆర్థిక సేవల విభాగం, సంస్కరణలు సహా పలు విషయాలపై సర్కార్​కు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సన్​రైజర్స్​పై కోహ్లీ సేన అద్భుత విజయం

సన్​రైజర్స్​ హైదరాబాద్​పై బెంగళూరు జట్టు పది పరుగులు తేడాతో విజయం సాధించింది. వార్నర్​ సేనను 153 పరుగులకే ఆల్​ఔట్​ చేసింది కోహ్లీ సేన. బెంగళూరు విజయంలో చాహల్​(3), శివమ్​ దుబే(2), నవదీప్​ సైని(2) కీలక పాత్రపోషించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శర్వానంద్ 'శ్రీకారం' కూడా ఓటీటీలోనే!

దేశంలోని థియేటర్లు ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. దీంతో సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. ఇప్పుడు శర్వానంద్ 'శ్రీకారం' చిత్రాన్ని ఇందులో తీసుకురావాలని భావిస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.