నివర్ తుపాను కారణంగా వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు 87 బృందాలు పనిచేస్తున్నాయని అగ్నిమాపక శాఖ డీజీ ఎండీ.అహసన్రెజా తెలిపారు. నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తుపాను సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కడప జిల్లాలో ఐటీఐ పరీక్షకు హాజరయ్యేందుకు వెళుతున్న విద్యార్థిని నదిలో పడిపోగా... తమ సిబ్బంది రక్షించారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో నీటి మధ్యలో చిక్కుకున్న ఇద్దరు రైతులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారని డీజీ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సిబ్బందికి ఒడిశా, గోవాలో ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు వివరించారు. రోడ్లపై విరిగపడ్డ చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం కలుగకుండా చూస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ...